MLC Kavitha Posters : హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈసారి కవితకు వ్యతిరేకంగా

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణను తల దించుకునేలా చేశావంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు.(MLC Kavitha Posters)

MLC Kavitha Posters : హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈసారి కవితకు వ్యతిరేకంగా

MLC Kavitha Posters : హైదరాబాద్ లో మరోసారి పొలిటికల్ పోస్టర్ల కలకలం రేగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.

హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణను తల దించుకునేలా చేశావంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. బేంగపేట పరిసర ప్రాంతాల్లోని మెట్రో పిల్లర్స్ వద్ద పోస్టర్లను పెట్టారు. గతంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోశ్ కు వ్యతిరేకంగా ఇదే విధంగా దుండగులు పోస్టర్లు అంటించారు. దీనికి కౌంటర్ గానే కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు.(MLC Kavitha Posters)

హైదరాబాద్‌లో పొలిటికల్ సెటైరికల్ పోస్టర్ల వార్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, పోస్టర్లు నగరంలో ప్రత్యక్షమయ్యాయి. కాగా.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

Also Read..BRS-BJP poster war: ఢిల్లీ లిక్కర్ స్కాం​లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ వేళ.. హైదరాబాద్ లో పోస్టర్ వార్

బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఉదయం మెట్రో పిల్లర్లపై ఈ పోస్టర్లు ప్రత్యక్షమవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ వ్యవహారానికి సంబంధించి కవితపై సెటైరికల్‌గా పోస్టర్లు ఏర్పాటు చేయటం కలకలం రేపుతోంది.(MLC Kavitha Posters)

Also Read..Amit Shah..’Washing Powder Nirma’ : ‘వాషింగ్ పౌడర్ నిర్మా’యాడ్‌తో అమిత్‌షాకు స్వాగ‌తం..!

రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి పోస్టర్లు వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇది బీఆర్ఎస్ నేతల పనే అని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. ఇది బీజేపీ నేతల పనే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో.. ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది.(MLC Kavitha Posters)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.