Pune Police : కిరణ్ గోసవి అరెస్టు

క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్‌ గోసవిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతనిపై నమోదైన చీటింగ్‌ కేసులో అతడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Pune Police : కిరణ్ గోసవి అరెస్టు

Aryankhan

Kiran Gosavi : క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్‌ గోసవిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతనిపై నమోదైన చీటింగ్‌ కేసులో అతడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.. గోసవి 2018 నుంచి పరారీలో ఉన్నాడని.. 2019లో అతడిని వాంటెడ్‌గా ప్రకటించామని పోలీసులు తెలిపారు. క్రూయిజ్‌ షిప్‌ కేసు ద్వారానే అతడి ఆచూకీ తెలిసిందన్నారు పోలీసులు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసవి తన వద్ద నుంచి మూడు లక్షలు తీసుకున్నాడని.. చిన్మయ్‌ దేశ్‌ముఖ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గోసవి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Read More : Telangana: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు..70 మంది విద్యార్థులకు అస్వస్థత

డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న గోసవిపై అతని బాడిగార్డ్, మరో సాక్షి అయిన ప్రభాకర్‌ సాయిల్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. శ్యామ్‌ డిసౌజా అనే వ్యక్తితో గోసవి మంతనాలు జరిపి 25 కోట్లు డిమాండ్‌ చేశాడని ఇందులో 8 కోట్లు కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేకు ఇవ్వాలని గోసవి ఆ వ్యక్తితో చెప్పినట్లు ప్రభాకర్‌ తెలిపారు. అయితే ప్రభాకర్‌ ఆరోపణలను ఖండించాడు గోసవి. అవసరమైతే తన కాల్స్‌, చాట్స్‌ను బయటపెట్టుకోవచ్చన్నాడు. డ్రగ్స్ కేసులో సాక్ష్యంగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అబద్దాలు చెబుతున్నారని కిరణ్ ఆరోపించారు. అతని సీడీఆర్ విడుదల చేయాలని కిరణ్ డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం తాను పుణె పోలీసులకు లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. కానీ పుణె పోలీసులు మాత్రం అతడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.