Rohit Sharma on WTC Final: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

Rohit Sharma on WTC Final Preparation: ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు టీమిండియా సన్నద్దతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.

Rohit Sharma on WTC Final: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

Rohit Sharma on WTC Final Preparation: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తో భారత్ మరోసారి సొంతం చేసుకోవడంతో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. ఓవల్ వేదికగా జూన్ 7 జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గతేడాది తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పొందడంతో కనీసం ఈ సారి అయినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడం కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అదే సమయంలో ఐపీఎల్ డబ్య్లూటీసీ ఫైనల్లో భారత విజయావకాశాలను దెబ్బతీస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) డబ్య్లూటీసీ ఫైనల్ సన్నద్దతపై స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుత భారత టెస్ట్ రెగ్యులర్‌ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) మాత్రమే ఐపీఎల్ ఆడడం లేదు. మిగిలిన అందరూ టీ20 లీగ్ ఆడనున్నారు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ఐపీఎల్ లో ప్లేఆఫ్‌లకు చేరుకోలేని భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు రెండు వారాల కండిషనింగ్ క్యాంప్ కోసం లండన్‌కు వెళతారని చెప్పాడు.

Also Read: కోహ్లి ఈజ్ బ్యాక్.. 6 నెలల్లో 5 ఇంటర్నేషనల్ సెంచరీలు.. ఫ్యాన్స్ ఫుల్ జోష్..

ఐపీఎల్ లో భారత ఆటగాళ్లపై భారం పడనివ్వమని తెలిపాడు. ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాం. వారికి కావాల్సినంత విరామం ఇస్తాం. వారిపై పని భారం పడనివ్వకూడదని ఫ్రాంఛైజీలకు ముందుగానే తెలియజేశాం. ఇంగ్లాండ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో ఫాస్ట్ బౌలర్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాం. మేము ఫాస్ట్ బౌలర్లందరికీ కొన్ని (ఎరుపు) డ్యూక్ బాల్‌లను పంపుతున్నాము. ఐపీఎల్ మధ్యలో వారికి వీలైనప్పుడు డ్యూక్ బాల్స్ తో ప్రాక్టీస్ చేస్తారు. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Also Read: షమీ కనిపించగానే క్రికెట్ స్టేడియంలో జై శ్రీరామ్ నినాదాలు

తటస్థవేదికపై కావడంతో..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ తటస్థ వేదికపై జరగనుండడంతో భారత్ కు గాని ఆస్ట్రేలియాకు గాని ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. ఇరు జట్లకు సమాన విజయావకాశాలు ఉంటాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే ఇంగ్లాండ్ లో చాలా మ్యాచ్ లు ఆడాయి. కాబట్టి అక్కడి పరిస్థితులు అన్ని తెలుసు. మేము మా శాయశక్తుల గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అత్యున్నత క్రికెట్ ను ఆడతాం. మాలో కొందరు కౌంటీ క్రికెట్ ఆడారు. కాబట్టి కుర్రాళ్లకు అక్కడి పరిస్థితులు కొత్త కాదు. ఈ సారి కచ్చితంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తో భారత్ కు వస్తామన్న ధీమాను రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు.