Prophet row: దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు కార‌ణం నుపూర్ శ‌ర్మ కాదు: రాహుల్‌

'దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దేశంలో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే సృష్టించింది. అంతేగానీ, ఈ ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులకు కార‌ణం ఎవ‌రో ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు కాదు. ఆగ్ర‌హ‌, ద్వేష‌పూరిత వాతావ‌ర‌ణం దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకం'' అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Prophet row: దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు కార‌ణం నుపూర్ శ‌ర్మ కాదు: రాహుల్‌

Rahul Gandhi

Prophet row: దేశంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కేర‌ళ‌లోని త‌న నియోజ‌క వ‌ర్గం వ‌యానాడ్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపూర్ శ‌ర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో దేశంలో చెల‌రేగిన క‌ల‌క‌లంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

Heavy Rain : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు

దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ”దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దేశంలో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే సృష్టించింది. అంతేగానీ, ఈ ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులకు కార‌ణం ఎవ‌రో ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు కాదు. ప్ర‌ధాన మంత్రి, హోం మంత్రి, ఆర్ఎస్ఎస్ క‌లిసి దేశంలో ఈ వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. ఆగ్ర‌హ‌, ద్వేష‌పూరిత వాతావ‌ర‌ణం దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకం” అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, వ‌యానాడ్‌లోని త‌న కార్యాల‌యంలో దాడి జ‌రిగింద‌ని రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిజానికి అది త‌న కార్యాల‌యం కాద‌ని, అది వ‌యానాడ్ ప్ర‌జ‌ల కార్యాల‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

కాగా, నుపూర్ శ‌ర్మ చేసిన బాధ్య‌తార‌హిత వ్యాఖ్య‌ల వ‌ల్ల దేశం మొత్తం ఆగ్ర‌హ జ్వాల‌లు చెల‌రేగాయ‌ని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. చీప్ ప‌బ్లిసిటీ, రాజ‌కీయ అజెండాలో భాగంగ‌నే అటువంటి వ్యాఖ్య‌లు చేసిన‌ట్లున్నార‌ని చెప్పింది. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. రెండు రోజుల క్రితం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోనూ ఓ టైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.