Rythu Bandhu : రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది.

Rythu Bandhu : రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bandhu

Rythu Bandhu : తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఎకరానికి 5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. వానాకాలం సీజన్ కు సంబంధించి దాదాపు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్ల డబ్బులు అందాయి. ఇక యాసంగి సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతుబంధు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Akhanda Fire : అఖండ సినిమా చూస్తుండగా మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో… తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని.. దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

గత వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి.. నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్

వానాకాలం సీజన్ లో 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లను రైతుబంధు సాయంగా అందించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. అయితే.. యాసంగి సీజన్‌లో రైతుబంధు సాయం బ‌డ్జెట్ మ‌రింత పెరుగ‌నుంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరమ‌ని అధికారులు అంచనా వేశారు.