Ayyappaswamy Darshanam : శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం.. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గంలో అనుమతి

జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.

Ayyappaswamy Darshanam : శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం.. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గంలో అనుమతి

Ayyappa (1) 11zon

Sabarimala Ayyappaswamy darshanam : శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి అయ్యప్పస్వామి దర్శనం మొదలైంది. ప్రతి రోజూ వేకువజామున 4 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతించారు.

జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కు అవకాశం కల్పించారు.

Restrictions AP : ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

అయితే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు కోవిడ్ నెగెటివ్ ధృవపత్రం తప్పనిసరి. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉండనుంది. హరివరాసనం తరువాత జనవరి 19న ఆలయాన్ని మూసివేయనున్నారు.