Gujarat : గుజరాత్ లో ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు..11 ఫిషింగ్ బోట్‌లు స్వాధీనం

గుజరాత్‌లోని ఇండో-పాక్ సముద్ర సరిహద్దులోని హరామి నాలా క్రీక్ ప్రాంతంలో.. బీఎస్‌ఎఫ్ ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేసింది.

Gujarat : గుజరాత్ లో ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు..11 ఫిషింగ్ బోట్‌లు స్వాధీనం

Six Pakistani Fishermen Held In Harami Nala

Six Pakistani fishermen held in Harami Nala :  గుజరాత్‌లోని ఇండో-పాక్ సముద్ర సరిహద్దులోని హరామి నాలా క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ల చొరబాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) శుక్రవారం ఆరుగురు పాకిస్థానీ పౌరుల్ని అరెస్టు చేసింది.

భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ చేపట్టిన (ఫిబ్రవరి 10,2022)ఆపరేషన్‌ సత్ఫలితాలు ఇస్తోంది. సర్‌ క్రీక్‌ ప్రాంతంలో నిన్న 11 ఖాళీ పాకిస్థానీ పడవలను గుర్తించిన తరువాత బీఎస్‌ఎఫ్‌ ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించింది. దీంట్లో భాగంగానే క్రీక్‌ క్రొకడైల్‌ విభాగానికి చెందిన కమాండోలను వేర్వేరు ప్రదేశాల్లో ఎయిర్‌ డ్రాప్ చేసింది. ఈ క్రమంలో కమాండోలు భారత్‌లో దాక్కున్న ఆరుగురు పాకిస్థానీ మత్స్యకారులను అదుపులోకి తీసుకొన్నారు మన బోర్డర్ సెక్యూరిటీ బోర్డు సిబ్బంది. ఇంకా ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఒక డ్రోన్‌ కెమెరాను ప్రయోగించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. మొత్తం 11 పాకిస్థాన్‌ పడవలను గుర్తించారు. దీంతో ఈ పడవల ద్వారా పాక్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వారి కోసం వేట ప్రారంభించారు. తాజాగా అదుపులోకి తీసుకొన్న వారిని విచారణ కోసం హెలికాప్టర్లలో తరలించారు.300 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో భారీ శోధన ఆపరేషన్‌ను కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌లను స్వాధీనం చేసుకున్నామని BSF తెలిపింది.