CM KCR Letter : ధాన్యం కొనుగోలు చేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

Kcr Letter
CM KCR letter to PM Modi : ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ లేదని చెప్పారు. పంజాబ్, హర్యానాలో వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరణ జరగడం లేదన్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు ఆత్మహత్యలు, వలసలు తగ్గాయని తెలిపారు.
Central Govt : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇదిలావుంటే తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధాన్యం ఉత్పత్తి పెరగడంతో ఎగుమతికి అవకాశం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ధాన్యం సేకరణపై నేరుగా స్పందించేందుకు నిరాకరించారు.
తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 2 వరకు వేచి చూడాలని.. సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
CM KCR : ధాన్యం కొనుగోలు సేకరణ.. తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం – కేసీఆర్
అందులో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు. గురువారం(మార్చి 24,2022) వారు మంత్రిని కలువాలనుకున్నారు. యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే.