CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

 జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు.

CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ

Kcr

CM KCR in Delhi: జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో మరో ప్రత్యామ్న్యాయ కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో సమావేశం నిమిత్తం శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన..శనివారం పలువురు నేతలను కలుసుకున్నారు. ముందుగా ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఇక సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

Other Stories:Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్

దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో..ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. దేశ రాజకీయలు, ఆర్ధిక పరిణామాలపై చర్చించిన నేతలు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికపైనా చర్చించారు. మధ్యాహ్నం 4.30 గంటలకు వీరి భేటీ ముగిసింది. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పలు ప్రాంతాలను సీఎం కేసీఆర్ సందర్శించేందుకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి సౌత్ మోతీభాగ్ లోని సర్వోదయ స్కూల్, మొహల్లా క్లినిక్ ను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మొహల్లా క్లినిక్ లను నిర్మిస్తుంది.

Other Stories: MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత

అనంతరం ఇరువురు నేతలు కూడా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇక ఆదివారం(22న) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లనున్న సీఎం కేసీఆర్..అక్కడ జాతీయ రైతు ఉద్యమంలో మృతి చెందిన 600 రైతు కుటుంబాలను కలుసుకోనున్నారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరుపున ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు ఆ చెక్కులను ఆదివారం నాడు జరిగే సమావేశంలో బాధిత కుటుంబాలకు అందించనున్నారు సీఎం కేసీఆర్.