Sharmila fired On KCR : ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే..ప్రభుత్వం వడ్లు కొనేలా చేస్తా : షర్మిల

ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే రైతులు కష్టపడి పండించి వడ్లని ప్రభుత్వం కొనేలా చేస్తానంటూ వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ కు , టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలని రైతు ఆవేదన యాత్రలో

Sharmila fired On KCR : ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే..ప్రభుత్వం వడ్లు కొనేలా చేస్తా : షర్మిల

Sharmila Fired On Kcr And Trs Party

Sharmila fired on kcr and trs party : సీఎం కేసీఆర్ పై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. రైతు ఆవేదన యాత్ర చేపట్టిన షర్మిల కేసీఆర్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. రైతులు పండించి ధాన్యం కొనకుండా రైతుల ఆత్మహత్యకు కారణమవుతున్న కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలని రైతు ఆవేదన యాత్రలో పిలుపునిచ్చారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనని కెసిఆర్ కు చావుడప్పు కొట్టాలని అన్నారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేసైనా కేసీఆర్ తో వడ్లు కొనిపిస్తానని..నా ప్రాణం పోయిన రైతుల పక్షాన కొట్లాడుతానని షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల కష్టాలు చూస్తుంటనే కడుపు తరుక్కుపోతోందని..కానీ కేసీఆర్ కు కనీసం బాధ కూడా లేదని ఆరోపించారు.

Read more : Hema Malini : రోడ్లను తన బుగ్గలతో పోల్చడంపై స్పందించిన హేమామాలిని

సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని అన్నారు. సదాశివ నగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య ఇటీవల చనిపోయాడు. రైతు ఆవేదన యాత్ర రెండో రోజు రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన రాజయ్య కుమారుడికి హైదరాబాద్ లో జాబ్ ఇప్పిస్తానని, కూతురు చదువుకు సాయం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్నదాతలకు టీఆర్ఎస్ చావు డప్పు కొడుతోందన్నారు. కానీ అందరూ కలసి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలన్నారు.

ఈ సందర్భంగా షర్మిల కేసీఆర్ కు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘కేసీఆర్.. మీ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తారా? చావు డప్పు కొట్టేందుకే మిమ్మల్ని సీఎంను చేశారా ప్రజలు? ఏడేళ్లలో పాలనలో ఎంతో మంది రైతులు, నిరుద్యోగులకు చావుడప్పు కొట్టింది మీరు కాదా? అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. వడ్లు కొనని మీకు అధికారం ఎందుకు అని రైతాంగం ప్రశ్నిస్తోంది.దీనికి మీరు సమాధానం చెప్పగలరా? చెప్పే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. మద్దతు ధర ఉన్న పంట వేయొద్దనడానికి మీకు అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పే సీఎంకు.. తెలంగాణ నేలల్లో వరి తప్ప ఇంకేమీ పండదనే విషయం తెలియదా? వరి వేయమని కేంద్రం దగ్గర ఎవరిని అడిగి సంతకం పెట్టారు? అని ప్రశ్నించారు.

Read more : Namma Metro : ఉదయం 5 నుంచి మెట్రో రైలు సేవలు… ఎక్కడంటే….

రెండు నెలల్లో 200 మంది రైతులకు పైసా సాయం చెయ్యలేదు. కానీ హర్యానాలో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తానన్నారు. ఏం తెలంగాణ రైతులవి ప్రాణాలు కాదా? రాష్ట్ర రైతాంగం ప్రాణాలకు విలువ లేదా? అని తీవ్ర ఆగ్రహంతో షర్మిల ప్రశ్నించారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..సీజన్ ఏదైనా వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.. వరి వద్దన్న సీఎం మనకు వద్దు అని ప్రజలు నినదించాలని పిలుపునిచ్చారు.

వరి కొనాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. కేంద్రానికి ఇస్తారా లేదా పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటారా అనేది రైతులకు అనవసరం. వడ్లను రా రైస్ చేసుకుంటారా, బాయిల్డ్ రైస్ చేసుకుంటారా అనేది ప్రభుత్వ ఇష్టం’ అని షర్మిల స్పష్టం అంటూ తీవ్ర పదజాలంతో షర్మిల స్పష్టంచేశారు.