Presidential Election : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌

మంగళవారం భారత ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశ్వినీకుమార్‌ మొహల్‌.. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన అధికారుల బృందానికి బ్యాలెట్‌బాక్స్‌ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది.

Presidential Election : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌

Ballot Box

presidential election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌ను హైదరాబాద్‌కు చేరుకుంది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి అధికారులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఈ ఎన్నికలకు హైదరాబాద్‌ ఏఆర్‌వోగా వ్యవహరిస్తున్న ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ సెక్రటరీ సుధాకర్‌, సీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ సెక్రటరీ విజయ్‌కిషోర్‌ ఢిల్లీకి వెళ్లారు.

మంగళవారం భారత ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశ్వినీకుమార్‌ మొహల్‌.. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన అధికారుల బృందానికి బ్యాలెట్‌బాక్స్‌ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. బ్యాలెట్‌బాక్స్‌ను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ అసెంబ్లీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. భారత ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణకు అసవరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్స్, స్పెషల్ పెన్స్, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్‌తోపాటు ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సామగ్రిని తరలిస్తోంది. ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది.  ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంపుతారు. విమానాల్లో ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో ఎయిర్ టికెట్ బుక్ చేస్తారు. విమానం ఫ్రంట్ రో (మొదటి వరుస సీట్లు)లో ఈ సీటు బుక్ చేస్తారు. పక్కనే వీటిని తీసుకెళ్లే ఒక ప్రత్యేక అధికారి కోసం సీటు బుక్ చేస్తారు. ఈ బాక్సులను ఎన్నికలు నిర్వహించే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కు అందజేస్తారు.

Chandrababu Key Decision : రాష్ట్రపతి ఎన్నికలు.. టీడీపీ మద్దతు ఎవరికో చెప్పేసిన చంద్రబాబు

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. 21న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.