PM Modi: ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి

ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

PM Modi: ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి

Pm Modi

PM Modi: ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ

జూలై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనల కారణంగా సభా కార్యక్రమాలు స్తంభించాయి. సోమవారం సమాజ్‌వాదీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడి 10వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా చాలాసార్లు ప్రభుత్వ పనిలో కొన్ని అడ్డంకులు సృష్టించాయని అన్నారు. ఇటీవలి కాలంలో సమాజం, దేశ ప్రయోజనాల కంటే భావజాలం, రాజకీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ధోరణి కనిపిస్తోందని ప్రధాని అన్నారు.

AP Telangana Debts : అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ అప్పుల వివరాలు విడుదల

ఇదిలాఉంటే ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్‌సభ నుండి స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.