Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.

Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి

Revanth (3)

Revanth Reddy : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని పేర్కొన్నారు. రైతాంగానికి తాము చేయబోయే డిక్లరేషన్ ను రాహుల్ ప్రవేశ పెట్టారని తెలిపారు. రాహుల్ సభ ప్రకంపనలు సృష్టించిందన్నారు. రైతు డిక్లరేషన్ దెబ్బకు కలుగులో దాక్కున్న ఎలకలు బయటకు వచ్చాయని చెప్పారు. తండాలు, గ్రామాల్లో రైతు డిక్లరేషన్ పైనే చర్చ జరుగుతోందన్నారు. 9 తీర్మానాలను డిక్లరేషన్ లో ప్రకటించామని తెలిపారు.

టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పై మాటల దాడి పెంచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై టీఆర్ఎస్ కు అవగాహన లేదని విమర్శించారు. రాహుల్ పై కేటీఆర్ అహంభావంతో మాట్లాడారని పేర్కొన్నారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చరిత్ర ఏంటో తెలుసుకున్నాకే గాంధీ కుటుంబం గురించి కేటీఆర్ మాట్లాడాలని సూచించారు.

Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి

దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడేముందు కేటీఆర్ కు చరిత్ర తెలిసి ఉండాలన్నారు. దళితులను ప్రతిపక్ష పార్టీ నేతగా చూసి ఓర్వలేకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఏ హోదాతో కేటీఆర్ రాహుల్ ను విమర్శిస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు ? అని ప్రశ్నించారు.