Uddhav Thackeray: గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? ఆర్ఎస్‌ఎస్, బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం

సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని, అప్పుడు మీసత్తా ఎంతో తెలుస్తుందంటూ షిండే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Uddhav Thackeray: గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? ఆర్ఎస్‌ఎస్, బీజేపీపై ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం

Uddhav Thackeray

Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఖేడ్ పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. శివసేన పేరు, చిహ్నాన్ని కోల్పోయిన తరువాత నిర్వహించిన తొలి ర్యాలీ ఇది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, షిండే వర్గం పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోమూత్రం చల్లడంవల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా అని ప్రశ్నించారు. గో మూత్రం చల్లడం వల్ల మనకు స్వాతంత్ర్యం రాలేదని, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలుసుకోవాలంటూ ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. బీజేపీ అత్యంత అవినీతిపరులున్న రాజకీయ పార్టీ అని థాక్రే అభివర్ణించారు. సీఎం ఏక్ నాథ్‌షిండే వర్గానికి శివసేన పేరు, బాణం – విల్లు గుర్తును ఈసీ కేటాయించడంపై థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారని, కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరని అన్నారు.

Uddhav Thackeray: ఈసీ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం .. ఆ విషయంలో నో చెప్పిన న్యాయస్థానం

సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని, అప్పుడు మీసత్తా ఎంతో తెలుస్తుందంటూ షిండే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని, శివసేనను అంతం చేసేందుకు బీజేపీ క్రూరమైన కుట్రలు చేసిందని ఆరోపించారు. ఆ పార్టీకి ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఉద్ధవ్ వ్యాఖ్యానించారు

Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నామని, అప్పట్లో ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని అమిత్ షా విమర్శించాడని, ప్రస్తుతం మేఘాలయలో బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. మీరు ఎవరి బూట్లు నాకుతున్నారంటూ థాక్రే అమిత్ షాను ప్రశ్నించారు. స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేనివారిని 2024లో సమాధి చేయాలని నిర్ణయించుకున్నామని, భారతమాతను మళ్లీ బానిసలుగా మార్చబోమని శపథం చేయాలని, ఇలా చేయాలనుకుంటే 2024 లోక్ సభ ఎన్నికలే చివరివి అని ఉద్ధవ్ థాక్రే ప్రజలకు పిలుపునిచ్చారు.