Maharashtra Politics: మహాలో పెరిగిన ముఖ్యమంత్రి అభ్యర్థులు.. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా సీఎం అవుతానంటున్న కేంద్రమంత్రి అథవాలె

శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది’’ అని అథవాలె అన్నారు.

Maharashtra Politics: మహాలో పెరిగిన ముఖ్యమంత్రి అభ్యర్థులు.. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా సీఎం అవుతానంటున్న కేంద్రమంత్రి అథవాలె

Ramdas Athawale

Maharashtra Politics: మహారాష్ట్రలో ఉన్నట్టుండి ముఖ్యమంత్రి అభ్యర్థులు పెరిగారు. నిన్నటి వరకు అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నవారు కూడా ముఖ్యమంత్రి అవుతానంటూ ముందుకు వచ్చారు. అలా అయ్యారు కూడా. అయితే తాజాగా అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేని పార్టీల నేతలు కూడా ముఖ్యమంత్రి ఆశను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలె) అధినేత, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అయిన రాందాస్ అథవాలె కూడా ఈ వరుసలోకి వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఉందంటూ తన ఆశను వెల్లడించారు.

Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

భారతీయ జనతా పార్టీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ చేతులు కలపున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ పార్టీనే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అథవాలె వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది’’ అని అథవాలె అన్నారు.

Bihar: ధీరేంద్ర శాస్త్రీని జైలులో వేయాలి.. బిహార్ ఆర్జేడీ చీఫ్ వివాదస్పద వ్యాఖ్యలు

‘‘ఏమాత్రం అవకాశం ఉన్నా.. నేను కూడా ముఖ్యమంత్రి రేసులోకి రావాలి అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న ఏక్‭నాథ్ షిండే ప్రభుత్వం బాగానే పని చేస్తోంది. ఆయన రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేస్తున్నారు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘శరద్ పవార్ మాకు రాజకీయాలు నేర్పారు. అనుభవం ఉన్న అలాంటి నాయకులు ఎన్డీయేతో కలిసి రావాలి. భిన్న భావజాలాలు ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ లాంటి వారు కూడా ఎన్డీయేతో కలిసి నడిచారు. అందుకే శరద్ పవార్ కూడా ఈ ప్రతిపాదన మీద ఆలోచించాలి’’ అని అన్నారు.

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ నన్ను 91 సార్లు తిట్టింది.. స్వయంగా వెల్లడించిన ప్రధాని మోదీ

మహారాష్ట్ర అసెంబ్లీలో అథవాలె నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలె)కు ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఆ పార్టీ నుంచి మొత్తంగా ముగ్గురు చట్ట సభ సభ్యులు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మొన్నటి నాగాలాండ్ అసెంబ్లీ సభ్యులు. ఇక ఉన్న ఒక్క అథవాలె కూడా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు కాదు. ఈయన రాజ్యసభ సభ్యుడు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహా అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఉందంటూ ఆశ వ్యక్తం చేయడంపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.