VRA: వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో అధికారులు VRAతో స్వీపర్ పనులు చేయిస్తున్న వైనం బయటపడింది.

VRA: వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న అధికారులు

Sweeper Work With Vra In Vemulawada Rda Office

Updated On : April 18, 2022 / 5:32 PM IST

sweeper work with VRA : తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో అధికారులు వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న వైనం బయటపడింది. వీఆర్ఏ ప్రశాంత్ తో చీపురు పట్టించారు అధికారులు. బోయిన్ పల్లి వీఆర్ఏగా పనిచేస్తున్న్ ప్రశాంత్ తో అధికారులు కార్యాలయంతో పాటు వెలుపల కూడా శుభ్రం చేయిస్తున్నారు.

ప్రతీరోజు ఆఫీసు శుభ్రం చేయాలని అధికారులు ప్రశాంత్ కు హుకుం జారీ చేశారు. అధికారులకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోవటంతో వీఆర్ఏ ప్రశాంత్ వారు చెప్పినట్లే చీపురు పట్టుకుని ఆఫీసు అంతా శుభ్రం చేస్తున్నాడు. వేములవాడలో ఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్వీపర్..సిబ్బందిని ను ఏర్పాటు చేయకుండా వీఆర్ఏతోనే అధికారులు కార్యాలయాన్ని శుభ్రం చేయిస్తున్నారు.