Venkaiah Naidu : సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం-వెంకయ్య నాయుడు

సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు.

Venkaiah Naidu : సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం-వెంకయ్య నాయుడు

Vice President Venkaiah Naidu

Venkaiah Naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించారు. సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు.

”రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషి. ప్రజలంతా సమానమని వెయ్యేళ్ల కిందటే చాటారు. దళితులను ఆలయప్రవేశం చేయించిన మానవతావాది. కులం కంటే గుణం గొప్పదని ఎలుగెత్తారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎన్నో దేశాల నుంచి వచ్చి సందర్శిస్తున్నారు. సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు, అందరికీ పంచాలి” అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

”ఆధ్యాత్మిక వేత్తగా సామాజిక సంస్కరణ అభిలాషి రామానుజాచార్యులు. శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిర్భవించడం ఆనందించాల్సిన విషయం. ప్రపంచంలో ఇది ఎనిమిదో అద్భుతం. ప్రపంచ నలుమూలల ఉన్న వ్యక్తులు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. సమతామూర్తి సుగుణాలను సమాజానికి పంచడమే నిజమైన నివాళి. సమతామూర్తి ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వర్‌రావుకు భారత ప్రభుత్వం తరఫున అభినందనలు. సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు.. పంచాలి.

సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక భావానికి సేవా భావాన్ని జోడించాలి. ఆస్తులు పెంచుకోవడమే కాదు పంచుకోవడంలో ఎంతో అనందం ఉంది. రామానుజాచార్యులు గురువు కోసం చేసిన శ్రమ నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గూగుల్‌ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు. గూగుల్‌ రిపేర్‌ వచ్చినా గురువు రావాల్సిందే. ఆచార్యులు, పీఠాధిపతులు తమ సందేశాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి తదితరులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వరరావు సమతా కేంద్రం విశిష్టతను ఉపరాష్ట్రపతికి వివరించారు. శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాలను ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.

భీష్మ ఏకాదశి పర్వదినాన ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. మెగాస్టార్‌ చిరంజీవి, దిల్‌రాజు సతీసమేతంగా సమతామూర్తి కేంద్రానికి వచ్చారు.