India vs Pakistan: మహిళా టీ20 వరల్డ్ కప్.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.

India vs Pakistan: మహిళా టీ20 వరల్డ్ కప్.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

India vs Pakistan: ‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 06.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, పాక్ జట్టుకు బిస్మా మరూఫ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. టీమిండియాకు సంబంధించి కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానుంది. భారత తుది జట్టు: షెఫాలి వర్మ, యస్తికా భాటియా, రోడ్రిగస్, హర్లీన్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.