PF Balance : మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు..!

పీఎఫ్‌ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈపీఎఫ్‌వో సంస్థ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌)ను ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులకు ఈ దిగులంతా దూరమైంది.

PF Balance : మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు..!

Pf

PF balance find out easily : ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌) ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్‌ నంబర్‌ మారుతుండేది. జీతంలో పీఎఫ్‌ కింద కత్తిరించిన మొత్తాన్ని ఉద్యోగి అకౌంట్‌లో మేనేజ్ మెంట్ జమ చేసిందో లేదో తెలిసేది కాదు. కానీ ఈపీఎఫ్‌వో సంస్థ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌)ను ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులకు ఈ దిగులంతా దూరమైంది.

ఎన్ని కంపెనీలు మారినా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌ మాత్రం మారడం లేదు. అలాగే యూఏఎన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేసిన తర్వాత అకౌంట్‌ను ట్రాక్‌ చేయడం చాలా సులభమైంది. మన బ్యాంక్‌ ఖాతా మాదిరిగానే తరచూ పీఎఫ్‌ అకౌంట్‌లోని సొమ్ము ఎంతన్నది చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్‌ పాస్‌బుక్‌ తరహాలోనే పీఎఫ్‌ పాస్‌బుక్‌ అందుబాటులోకి వచ్చింది.

Kachiguda Express : హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేసిన కార్మికులు

ఉమాంగ్‌ యాప్‌..
ఇందులో ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ను చూడవచ్చు. ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లను ట్రాక్‌ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని పొందడానికి ఉమాంగ్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఈపీఎఫ్‌వో పోర్టల్‌..
పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి మరో పద్ధతి epfindia. gov. in/ site_en/index.php. అనే వెబ్‌సైట్‌. లాగిన్‌ తర్వాత అవర్‌ సర్వీసెస్‌ అనే అప్షన్‌లో ఫర్‌ ఎంప్లాయిస్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత సేవల విభాగంలో మెంబర్‌ పాస్‌బుక్‌ క్లిక్‌ చేస్తే పాస్‌బుక్‌ లోడ్‌ అవుతుంది. యూఏఎన్‌ నంబర్‌ యాక్టివేటైతే బ్యాలెన్స్‌ తెలిసిపోతుంది.

Coronavirus: దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు

ఎస్‌ఎంఎస్‌..
అన్నింటికన్నా సులువైన మార్గం ఎస్‌ఎంఎస్‌. స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా ఫర్వాలేదు. EPFOHO UAN ENG (చివరి మూడు అక్షరాలు మీరు ఎంచుకున్న భాషకు ప్రాతినిథ్యం వహిస్తాయి) అని 7738299899 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు. యూఏఎన్‌ నంబర్‌తో రిజిస్టరైన మొబైల్‌ నంబర్‌నే ఇందుకోసం ఉపయోగించాలి.

మిస్డ్‌కాల్‌..
ఈపీఎఫ్‌వో నంబర్‌కు మిస్డ్‌కాల్‌ చేయడం ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. 011-22901406కు మీ రిజిస్టర్డ్‌ నంబర్‌తో మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. వెంటనే ఈపీఎఫ్‌ఓ మీకు మీ పీఎఫ్‌ ఖాతా వివరాలన్నింటినీ పంపిస్తుంది. ఈ సేవలను పొందడానికి కూడా యూఏఎన్‌ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌నే వాడాలి.