అమ్మాయిల మనసును లాక్‌డౌన్ మార్చేసింది…రొమాంటిక్ కాదు, కేరింగ్ మగాళ్లే కావాలంట

  • Published By: venkaiahnaidu ,Published On : June 7, 2020 / 02:53 PM IST
అమ్మాయిల మనసును లాక్‌డౌన్ మార్చేసింది…రొమాంటిక్ కాదు, కేరింగ్ మగాళ్లే కావాలంట

కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో అమ్మాయిల ఆలోచనల్లో చాలామార్పులు వచ్చాయంట. సింగిల్ గా లేదా ఒంటరిగా ఉండే మహిళలు లేదా యువతుల ఆలోచనలపై లాక్ డౌన్ ప్రభావం గట్టిగానే ఉందట. లాక్ డౌన్ ముందు వరకు తన బాయ్ ఫ్రెండ్ గా ఉండేవాడు అందంగా ఉండాలని,పార్టీకి వెళితే అందరిలో తన బాయ్ అందం చూసి అందరూ కళ్లుకోవాలని భావించే అమ్మాయిలు..ఇప్పుడు రొమాంటిక్ గా కాదు కేరింగ్ గా ఉండే మగాళ్లతో రిలేషన్ షిప్ కోరుకుంటున్నారట

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో చాలా జంటలు కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తరచుగా, వారు చాలా భిన్నమైన వ్యక్తులు, పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలతో ఉన్నారని, ఇది అనేక అభిప్రాయ భేదాలకు దారితీసినట్లు తాను గమనించానని ముంబైకి చెందిన 29ఏళ్ల ఆర్కిటెక్ట్ సోనియా చెప్పారు. లాక్ డౌన్ ముందు సహనంతో కూడిన మనిషిని కోరుకుంన్నానని, కాని లాక్డౌన్ తనలో ఆ అవసరం తీవ్రతరం అయిందని సోనియా తెలిపింది.

ఈ లాక్ డౌన్ ఒంటరి మహిళల శృంగారం మరియు డేటింగ్‌ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చిందని క్లినికల్ సైకాలజిస్ట్ రుచికా కన్వాల్ తెలిపారు. క్యాండిల్‌ లైట్ డిన్నర్ వంటివి గతంలో ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, ఇంటి పనులను లేదా వంటకాలను చర్చించడానికి సింపుల్ వీడియో కాల్‌లు లాక్‌డౌన్ సమయంలో మరింత ఉత్సాహాన్నిచ్చాయని ఆమె తెలిపారు. ఇంటిపనులను తాము పూర్తిచేశాము అని మగవాళ్లు చెప్పినప్పుడు తమకు రీఫ్రెషింగ్ గా ఉందని చాలామంది తన క్లయింట్ లు తనతో చెప్పారన్నారు. కొంతమంది అయితే వీడియో కాల్స్ తో కలిసి వంటచేయడం రొమాంటిక్ గా ఉందని చెప్పారని రుచికా కన్వాల్ తెలిపారు.

డేటింగ్ పై  ఒంటరి లేదా సింగిల్ మహిళల ఆలోచనా ధోరణి లాక్ డౌన్ ఏవిధంగా ప్రభావం చూపిందన్నది అర్థం చేసుకోవడానికి తాము నిపుణులు,సింగిల్ మహిళలతో మాట్లాడామని కన్వాల్ తెలిపారు.  అనేక మంది మహిళలు…. మానసిక ఆరోగ్యం గురించి చురుకుగా నేర్చుకోవలసిన అవసరాన్ని,దానిని జాగ్రత్తగా చూసుకోవాలని గ్రహించారు. కాబోయే భాగస్వామి మానసిక ఆరోగ్యం గురించి కేర్ తీసుకునేలా ఉండాలని కోరుకున్నారని కన్వాల్ చెప్పారు.

ఓ క్లయింట్ గురించి కన్వాల్ మాట్లాడుతూ…వ్యక్తిగత స్పేస్ అనే భావనపై అవగాహన లేని వ్యక్తితో చాలామంది కలిసి ఉండలేరు. ఖచ్చితంగా ఎల్లప్పుడూ సరిహద్దులను గౌరవించే వ్యక్తినే యువతి లేదా మహిళ కోరుకుంటుంది, కానీ అది ఎప్పుడూ ప్రమాణం కాదు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఇరుక్కున్న ఆమె లేదా ఒంటరి మహిళ..తన స్పేస్ ను ‘అతుక్కొని’ మరియు ‘మానసికంగా ఆధారపడే’ వ్యక్తితో పంచుకోవాలనే ఆలోచనను భయపెట్టిందన్ని కన్వాల్ తెలిపారు.