Aditya Chopra: 4 సినిమాలు.. రూ.400 కోట్లు.. నో చెప్పిన నిర్మాత!

ఒక్క దక్షణాది బాషల సినిమాలే కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం కరోనా వైరస్ దెబ్బకి విధించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేని ఈ పరిశ్రమలో..

Aditya Chopra: 4 సినిమాలు.. రూ.400 కోట్లు.. నో చెప్పిన నిర్మాత!

Aditya Chopra

Aditya Chopra: ఒక్క దక్షణాది బాషల సినిమాలే కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం కరోనా వైరస్ దెబ్బకి విధించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేని ఈ పరిశ్రమలో కొన్ని మార్పులు కూడా సంభవించాయి. అదే డిజిటల్ రిలీజ్. లాక్ డౌన్ లో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరగడంతో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి బడా బడా స్టార్లు సైతం కోవిడ్ మహమ్మారి సమయంలో తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. భారీ హైప్ ఉన్న సినిమాలు సైతం ఓటీటీలో విడుదల చేశారు.

Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!

కానీ, ఓ బాలీవుడ్ నిర్మాత మాత్రం తమ సినిమాలను కేవలం థియేటర్లలోనే విడుదల చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుండి వందల కోట్ల ఆఫర్లు వచ్చినా అన్నీ తిరస్కరించి థియేటర్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ నిర్మాత, ఆదిత్య చోప్రా తన ప్రొడక్షన్ హౌస్ ఆదిత్య ప్రొడక్షన్ లో ‘బంటీ ఔర్ బబ్లి 2’, ‘శంషేరా’, ‘పృథ్వీరాజ్’, ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Shyam Singha Roy: నాని జై అంటున్న ఓటీటీ.. నెట్ ఫ్లిక్స్‌కు శ్యామ్?

ఈ సినిమాలు పూర్తయి దాదాపు రెండేళ్లు అయినా అప్పటి నుండి కరోనా మహమ్మారి దెబ్బకి థియేటర్లలో విడుదల పరిస్థితి లేకపోవడంతో విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఈ సినిమాలకు ఓటీటీల నుండి పలు ఆఫర్లు వచ్చినా ఆదిత్యచోప్రా మాత్రం వాటిని థియేటర్లలోనే విడుదల చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు తిరిగి తీర్చుకొనేందుకు స్పష్టమైన ఆదేశాలు లేవు. ఇదే సమయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 4 సినిమాలను 400 కోట్లకు కొనుగోలు చేయడానికి చోప్రాకు ఆఫర్ ఇచ్చింది.

Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

కానీ నిర్మాత మాత్రం ససేమీరా నో చెప్పినట్లు తెలుస్తుంది. ‘పృథ్వీరాజ్’, ‘శంషేరా’ సినిమాలను వదిలేసి ‘బంటి ఔర్ బబ్లి 2’, ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ సినిమాల కోసం కూడా ఆదిత్య చోప్రాను మరోసారి ప్రయత్నించినా అమెజాన్ ప్రైమ్ కు చుక్కెదురైనట్లు బీ టౌన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఎప్పుడు పరిస్థితిలు చక్కబడితే అప్పుడే ఈ సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీలు ఖరారు కానున్నాయట.