Pushpa 2: మళ్లీ డిసెంబర్ నెలపై కన్నేసిన పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా, పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టగా, ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Pushpa 2: మళ్లీ డిసెంబర్ నెలపై కన్నేసిన పుష్పరాజ్

Allu Arjun Pushpa 2 Aiming December Release

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా, పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టగా, ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Pushpa 2 : పుష్ప-2లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నిజమేనా?

పుష్ప-2 మూవీ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెప్పడంతో, ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాను పార్ట్ 1 కంటే కూడా ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తుండటంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సీక్వెల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమాను సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Pushpa 2 Shooting : ఫాస్ట్ ఫాస్ట్‌గా పుష్ప 2 షూటింగ్.. సుకుమార్ భార్య స్పెషల్ పోస్ట్..

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంపై చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పుష్ప-2 మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని బన్నీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో పుష్ప-1 కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కాగా, ఆ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. అందుకే, ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, ఇప్పుడు పుష్ప-2 మూవీని కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిని చూపుతుందట. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.