Allu Arjun: మరోసారి ఆ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన బన్నీ.. నిజమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బన్నీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని బన్నీ తాజాగా అనౌన్స్ చేశాడు.

Allu Arjun: మరోసారి ఆ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన బన్నీ.. నిజమేనా?

Allu Arjun To Work With Trivikram Once Again

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బన్నీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని బన్నీ తాజాగా అనౌన్స్ చేశాడు.

Allu Arjun-Sandeep Vanga : సందీప్ వంగతో బన్నీ సినిమా.. ప్రభాస్ స్పిరిట్, బోయపాటి-బన్నీ సినిమాలు వాయిదా పడ్డట్టేనా?

అర్జున్ రెడ్డి వంటి కల్ట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని కన్ఫం చేశాడు. ఇక పుష్ప-2 మూవీ తరువాత సందీప్ రెడ్డితో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మరోసారి తనకు హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడితో బన్నీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తరువాత బన్నీ కోసం త్రివిక్రమ్ ఓ కథను రెడీ చేస్తున్నాడట.

Allu Arjun : అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్.. ఆశ్చర్యంలో అభిమానులు..

ఇప్పటికే త్రివిక్రమ్ స్టోరీలైన్‌ను బన్నీకి వినిపించగా, ఈ సినిమాకు బన్నీ ఓకే చెప్పాడట. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తరువాతే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈలోపు బన్నీ పుష్ప-2తో పాటు సందీప్ రెడ్డి వంగ సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉంది. మరి నిజంగానే త్రివిక్రమ్‌తో బన్నీ నాలుగోసారి సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.