Alluri: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసిన అల్లూరి.. ఆహా అంటోన్న ఫ్యాన్స్!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా మూవీ ‘అల్లూరి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే, ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది.

Alluri: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసిన అల్లూరి.. ఆహా అంటోన్న ఫ్యాన్స్!

Alluri Movie Locks OTT Partner

Alluri: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా మూవీ ‘అల్లూరి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తొలిసారి పోలీస్ పాత్రలో శ్రీవిష్ణు నటించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయాడని ఈ సినిమా చూసిన వారు అంటున్నారు.

Alluri Movie: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించిన తీరు బాగుందని.. ఈ సినిమాలోని అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని టాక్ రావడంతో ఈ సినిమా చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే, ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Alluri Trailer: అల్లూరి ట్రైలర్ టాక్.. పోలీస్ పవర్‍‌తో అదరగొట్టిన శ్రీవిష్ణు!

దీంతో ఈ సినిమాను త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరికొత్త లుక్‌లో కనిపించగా, ఆయన సరసన అందాల భామ కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేయగా, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.