Pushpa : అమేజాన్ ప్రైమ్‌లో ‘పుష్ప’.. ఎప్పుడు..? ఎంత రేట్‌కు..?

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ 'పుష్ప' సినిమాని తమ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 7న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా.....

Pushpa : అమేజాన్ ప్రైమ్‌లో ‘పుష్ప’.. ఎప్పుడు..? ఎంత రేట్‌కు..?

Pushpa

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. అన్ని సినీ పరిశ్రమలలో ఈ సినిమాపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అన్ని చోట్ల మంచి విజయం సాధించి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 20 రోజులు కూడా అవ్వకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకి సమాధానంగా ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దీనిపై పోస్ట్ చేసింది.

RGV : ట్విట్టర్లో కొనసాగుతున్న చర్చ.. పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ‘పుష్ప’ సినిమాని తమ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 7న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. కొంతమంది సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే స్టార్ హీరో సినిమా, భారీ విజయం సాధించిన సినిమా ఎందుకు ఓటీటీకి అని ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయినా కూడా ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడంతో చిత్ర యూనిట్ దీనికి ఒప్పుకున్నట్టు సమాచారం. రూ.22కోట్లకు పుష్ప స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. జనవరి 7న రాత్రి 8 గంటల నుంచి ‘పుష్ప’ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.