James : పునీత్ కోసం కలిసిన రాజకీయ పార్టీలు.. చివరి సినిమాని థియేటర్లలోంచి తీయొద్దు అంటూ ర్యాలీలు..

పునీత్ చివరి సినిమా కావడంతో అందరూ చూడటానికి ఆసక్తి చూపించారు. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ............

James : పునీత్ కోసం కలిసిన రాజకీయ పార్టీలు.. చివరి సినిమాని థియేటర్లలోంచి తీయొద్దు అంటూ ర్యాలీలు..

James

 

James Movie :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.

పునీత్ చివరి సినిమాకి మొదటి మూడు వారాలు హౌస్ ఫుల్ అయ్యాయి. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా పునీత్ చివరి సినిమా కావడంతో అందరూ చూడటానికి ఆసక్తి చూపించారు. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ వారం రోజులు ఇంకే సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. నేటితో సినిమా రిలీజ్ అయి వారం అయిపోవడంతో జనాలు తగ్గిన కొన్ని సెంటర్లలో ఈ సినిమాని తీసెయ్యబోతున్నారు.

Kartik Aaryan : గులాబీలతో యువ హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. సిగ్గుపడుతూనే ఫొటోలిచ్చిన హీరో

రేపు దేశ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ఉండటంతో కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాతో పాటు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్ సినిమాని వేసే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అయితే దీనిని పునీత్ అభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఈ విషయంపై మాట్లాడుతూ.. ”వేరే సినిమాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఒక సినిమాను బలవంతంగా నిలిపేసి మరో సినిమాను చూడాలని ఒత్తిడి చేయడం సరికాదు. వేరే సినిమాల కోసం జేమ్స్‌ సినిమాను బలి చేస్తున్నారు, అర్ధాంతరంగా జేమ్స్‌ను తొలగించడం బాధాకరం” అని అన్నారు.

Santanu Hazarika : శృతిహాసన్‌తో నా పెళ్లి అయిపొయింది..

ఇక ఇదే విషయంపై ఓ బిజెపి ఎమ్మెల్యే మాట్లాడుతూ..”వేరే భాషల సినిమాల కోసం జేమ్స్‌ సినిమాను ఎత్తివేయడం కరెక్ట్ కాదు. కన్నడ సంప్రదాయాలకు నిదర్శనం డాక్టర్‌ రాజ్‌కుమార్‌. అలాంటి వ్యక్తి కుమారుడు పునీత్‌ అకాల మరణం తరువాత విడుదల అయిన జేమ్స్‌ చిత్రాన్ని పక్కన పెట్టడం సరికాదు. రాష్ట్రంలో కన్నడ చిత్రాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి” అని అన్నారు. ఇక కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జేమ్స్ సినిమాకి మద్దతుగా మైసూరులో ర్యాలీ చేశారు. ఈ ప్రభావం కన్నడ నాట ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లపై కచ్చితంగా పడనుంది.