Amigos: ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ పాటలో ఇరగదీసిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడంతో, ఈసారి కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా క్రియేట్ అయ్యాయి.

Amigos: ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ పాటలో ఇరగదీసిన కళ్యాణ్ రామ్..!

Enno Ratrulosthayi Remix From Amigos Is Mesmerizing

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడంతో, ఈసారి కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా క్రియేట్ అయ్యాయి.

Amigos Teaser : మరో వైవిధ్యమైన కథతో కళ్యాణ్ రామ్.. అమిగోస్ టీజర్ రిలీజ్!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం మూవీలోని ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ సాంగ్ ‘‘ఎన్నో రాత్రులొస్తాయి’’ని రీమిక్స్ చేస్తున్నట్లు కళ్యాణ్ రామ్ ప్రకటించడంతో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే..?

రొమాంటిక్ మూడ్‌లో సెట్ చేసిన ఈ పాటలో కళ్యాణ్ రామ్, హీరోయిన్ అషికా రంగనాథ్ రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇక గిబ్రాన్ ఈ సాంగ్‌ను రీమిక్స్ చేయడంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడ్డాడు. ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్‌ను ఎక్కడా మిస్ కాకుండా ఈ పాటను ఆయన కంపోజ్ చేసిన విధానం బాగుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అదిరిపోయే వ్యూస్ దక్కించుకుంటోంది. ఇక రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న అమిగోస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.