Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

ఇప్పటి వరకూ ఎలా ఉన్నా.. కొత్త సంవత్సరం మాత్రం కలర్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. మిగతా వాళ్ల సంగతి సరే.. ప్రతిశుక్రవారం జాతకాలు మారిపోయే సినిమా వాళ్లు మరీ..

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

Telugu Star Hero's

Telugu Star Hero’s: ఇప్పటి వరకూ ఎలా ఉన్నా.. కొత్త సంవత్సరం మాత్రం కలర్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. మిగతా వాళ్ల సంగతి సరే.. ప్రతిశుక్రవారం జాతకాలు మారిపోయే సినిమా వాళ్లు మరీ ఆశపడుతుంటారు. 2021లో కోవిడ్ తో పెద్దగా సినిమాలు సరిగా రిలీజ్ అవ్వక.. అయ్యినా పెద్దగా సక్సెస్ అవ్వక.. నానా ఇబ్బందులు పడ్డారు చాలా మంది స్టార్లు. అలా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్లకు ఈ 2022 ఏడాది చాలా క్రూషియల్ కాబోతుంది. 2021 సినిమా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కోవిడ్ తో షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు సినిమాల రిలీజ్ లు లేటయ్యి భారీ నష్టాల్ని ఎదుర్కొంది. స్టార్లు కూడా ధియేటర్లో సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ లేక, చేసినా చూసే జనాలు లేక బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో 2022 మీదే ఆశలుపెట్టుకున్నారు అందరూ.

RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్

ముఖ్యంగా బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్ని లైన్లో పెట్టిన ప్రభాస్ కి 2022 క్రూషియల్ కాబోతోంది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా.. బాహుబలితో పాన్ ఇండియా లెవల్ హీరో అయిపోయారు. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు ప్రభాస్. ఎప్పుడో 2019లో సాహో సినిమా రిలీజ్ చేసిన ప్రభాస్.. అంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైనప్ చేసినా.. ఈ రెండేళ్లలో ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేకపోయారు. కానీ 2022లో మాత్రం ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాల్ని రిలీజ్ కి ఫిక్స్ చేశారు ప్రభాస్.

Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!

జనవరి 14న రిలీజ్ అవుతున్న రాదేశ్యామ్, జులైలో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తోచేస్తున్న ఆదిపురుష్ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కాదు.. దాదాపు 700 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నవి. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలతో 2022లో ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రభాస్ తన కలెక్షన్ల సత్తాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేస్కోవాల్సి ఉంటుంది. అందుకే 2022 ప్రభాస్ కు కీలకం కాబోతోంది.

Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క సినిమా రిలీజ్ కు కూడా నోచుకోని రామ్ చరణ్ కి కూడా 2022 క్రూషియల్ కాబోతోంది. మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి, ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్న ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి ట్రిపుల్ఆర్ తో జనవరి 7న ధియేటర్లోకొస్తున్నారు చరణ్. అంతే కాదు ఇప్పటి వరకూ రీజనల్ హీరోగా ఉన్న చరణ్.. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చూపించబోతున్నారు. 2019లో విపరీతమైన అంచనాలతో రామ్ చరణ్ బోయపాటితో చేసిన వినయవిధేయరామ డిజాస్టార్ అయ్యింది. దాంతో హిట్ ఇప్పుడు రామ్ చరణ్ కి అవసరం. ట్రిపుల్ఆర్ హిట్ తో పాటు.. పాన్ ఇండియా లెవల్ గా తన సత్తా ని ప్రూవ్ చేస్కోడానికి 2022 రామ్ చరణ్ కి చాలా క్రూషియల్ కాబోతోంది.

Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

స్టార్ హీరోల సరసన చేరి.. అప్పుడే పాన్ ఇండియా లెవల్ సినిమాని చేస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కూడా 2022 చాలా ఇంపార్టెంట్ కాబోతోంది. 2018లో వచ్చిన టాక్సీవాలా తర్వాత విజయ్ ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా కొట్టలేపోయాడు. అందుకే ఎలా అయినా 2022లో సత్తా చూపించాల్సి ఉంటుంది విజయ్. విజయ్ దేవరకొండకి 2022 చాలా క్రూషియల్ కాబోతోంది. ఎందుకంటే.. టాక్సీవాలా తర్వాత ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలూ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో.. 2022 విజయ్ కి క్రూషియల్ కాబోతోంది. 2022 లో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ మీదే అన్ని ఆశలూ పెట్టున్నాడు విజయ్. మైక్ టైసన్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఆడియన్స్ లో ఫీవర్ క్రియేట్ చేసింది.

RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?

రెండేళ్ల నుంచి ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్న నాని.. 2021లో శ్యామ్ సింగరాయ్ ని ధియేటర్లో రిలీజ్ చేశారు. కానీ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమా అంత పెద్ద హిట్ కాలేకపోయింది. అందుకే 2022లో ఎట్టి పరిస్తితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని డిసైడ్ అయ్యారు నాని. అందుకే అంటే సుందరానికి సినమాతో పాటు, దసరా లాంటి డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి ప్లాన్లు వేసుకన్నారు. ఆడియన్స్ పల్స్ ని మిస్ అవుతున్న నాని.. 2022లో నాని సక్సెస్ అయ్యి ఎలా అయినా ప్రూవ్ చేస్కోవాల్సి ఉంది.