OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే! Get Ready.. This is the upcoming movie in OTT this week!

OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఇంకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట హవా నడుస్తుండగానే.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.

OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

OTT Release: ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఇంకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట హవా నడుస్తుండగానే.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఓటీటీలో ఈ వారం కూడా గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.

OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం. తాజాగా యాభై రోజులు పూర్తిచేసుకొని థియేటర్లలో ఇంకా హవా కొనసాగిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తో పాటు హిందీ చిత్రం జొంబ్లివీ కూడా మే20వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా కూడా మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించిన కొత్త సినిమా ‘భళా తందనాన’. శ్రీవిష్ణు సరసన కేథరిన్‌ హీరోయిన్ గా నటించింది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 20 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!

హాలీవుడ్‌ మూవీస్ ది ఇన్విజబుల్‌ మ్యాన్‌, ద హంట్‌ మే 16వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుండగా.. వెబ్‌ సిరీస్‌ పూ కిల్డ్‌ సారా 3 మే 18వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. కన్నడ సినిమా హనీమూన్‌ మే 20వ తేదీ నుంచి వూట్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

×