GopiChand : అన్‌స్టాపబుల్‌లో క్యాన్సర్ పేషెంట్ అయిన చైల్డ్ సింగర్‌కి.. నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇచ్చిన గోపీచంద్

తాజాగా ఈ ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్ లో కూడా ఓ చిన్న పాపని తీసుకొచ్చారు. లక్ష్మి మనోజ్ఞ అనే ఓ పాప చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేస్తూ సింగర్ గా ఎదగడానికి ట్రై చేస్తుంది. కానీ 2020లో ఆమెకి క్యాన్సర్ అని తెలియడంతో వారి దగ్గర...........

GopiChand : అన్‌స్టాపబుల్‌లో క్యాన్సర్ పేషెంట్ అయిన చైల్డ్ సింగర్‌కి.. నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇచ్చిన గోపీచంద్

GopiChand gives singing offer to a child singer who suffering with cancer

GopiChand :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

ప్రతి ఎపిసోడ్ లో జీవితంలో కష్టపడుతూ, ఎదగడానికి ట్రై చేస్తున్న ఎవరో ఒకర్ని తీసుకువచ్చి వారి గురించి అందరికి తెలిసేలా చేస్తారు. ఏదో సాధించాలని కష్టపడుతూనే సమస్యలతో సతమతమవుతున్న వాళ్లలో ప్రతి ఎపిసోడ్ లో ఒకరిని తీసుకొచ్చి వారిని ప్రపంచానికి పరిచయం చేసి వారికి సహాయం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్ లో కూడా ఓ చిన్న పాపని తీసుకొచ్చారు. లక్ష్మి మనోజ్ఞ అనే ఓ పాప చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేస్తూ సింగర్ గా ఎదగడానికి ట్రై చేస్తుంది. కానీ 2020లో ఆమెకి క్యాన్సర్ అని తెలియడంతో వారి దగ్గర ట్రీట్మెంట్ కి అంతగా డబ్బులు లేకపోవడంతో బాలకృష్ణ నిర్వహిస్తున్న బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉచితంగా తీసుకుంటుంది. ఆ పాపని, వాళ్ళ ఫ్యామిలీని పిలవగా వాళ్ళు బాలయ్య కాళ్ళ మీద పడి మీ వల్లే ఆమెకి చికిత్స దక్కుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పాప ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స తీసుకుంటుంది. అయితే ఆ పాపకి గోపీచంద్ స్టేజిపైనే తన నెక్స్ట్ సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఆ పాప చాలా సంతోషించింది.

Gopichand : హీరోగా ఫస్ట్ సినిమా పోయినప్పుడు అందరూ చాలా మాటలు అన్నారు.. సినిమాల్లోకి వచ్చి తప్పుచేశా అనిపించింది..

అలాగే ఆ పాపకి బాలకృష్ణ ఒక గిటార్ ని బహూకరించాడు. ఇక అన్‌స్టాపబుల్ నుంచి ఒక లక్షరూపాయల బహుమతితో పాటు, స్పాన్సర్స్ నుంచి పలు గిఫ్ట్ హ్యాంపర్స్ ని కూడా అందించారు.