Trivikram : త్రివిక్రమ్ ట్వీట్.. పేర్ని నాని రిప్లై.. అంతా ఫేక్!
టికెట్ల రేట్ తగ్గింపు మరియు ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరిట ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Perni Nani 2
Trivikram: టికెట్ల రేట్ తగ్గింపు మరియు ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరిట ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆ ట్వీట్‌పై స్పందించినట్లు, వీటిలో ఉన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు ఆ పోస్ట్ సారాంశం.
Movie Theatres : ఏపీలో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్..
రీసెంట్‌గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ విషయం గురించి స్పందించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేదని.. ఒకవేళ ఆయన ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలి అనుకుంటే హారిక అండ్ హాసిని లేదా ఫార్చ్యూన్ ఫోర్ సినిమా (త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ) ద్వారా తెలియజేస్తారని తెలిపింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.
Chiranjeevi : టికెట్ రేట్లపై దయచేసి పునరాలోచించండి-చిరు విన్నపం..
కాగా.. రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని గురించి పునరాలోచించాలని చిరంజీవి కూడా ట్వీట్ చేశారు.
Any official statements from #Trivikram garu will only come from @haarikahassine & @Fortune4Cinemas
He doesn’t have any social media presence. Please don’t believe in any comments made by various profiles bearing his pic/name.@AndhraPradeshCM @perni_nani @IPR_AP
— Haarika & Hassine Creations (@haarikahassine) November 27, 2021
#Trivikram pic.twitter.com/nNPIL5bwhi
— subhan ali shaik (@SSubhanali2) November 27, 2021