Jr NTR: తారక్ న్యూ లుక్.. ఫోటో నెట్టింట వైరల్! Jr NTR New Look.. Tarak Photo goes Viral with Fan

Jr NTR: తారక్ న్యూ లుక్.. ఫోటో నెట్టింట వైరల్!

ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది.

Jr NTR: తారక్ న్యూ లుక్.. ఫోటో నెట్టింట వైరల్!

Jr NTR: ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. కుదిరితే పాన్ ఇండియా.. లేదంటే కనీసం రెండు భాషల్లో అయినా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో ప్లానింగ్ ఉంటుంది. వీరిలో ఎన్టీఆర్ ఇప్పుడు భారీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ హంగామా పూర్తవడంతో ఇక.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు తారక్.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

ఇందులో కొరటాల సినిమా ముందుగానే మొదలు కానుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాపై త్వరలోనే ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫుల్ డీటెయిల్స్ ప్రకటించనున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరోసారి స్టైలిష్ లుక్ లోకి మారనున్నట్లుగా తెలుస్తుంది. అరవింద సమేత సినిమా అనంతరం ఆర్ఆర్ఆర్ భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగాడు. ఆహార్యంలో గంభీరంగా కనిపించేందుకు రాజమౌళి సూచనల మేరకు ఎన్టీఆర్ అలా తయారయ్యాడు.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

అయితే.. కొరటాల శివ సినిమా కోసం మరోసారి స్టైలిష్ గా మారనున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మేకోవర్ మీద దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. మళ్ళీ మోడ్రన్ లుక్ లోకి మారాల్సి ఉండడంతో.. ముందుగా స్పెషల్ డైట్ ప్లాన్ తో మొదలుపెట్టనున్న తారక్ కాస్త సన్నబడి సరికొత్తగా మారనున్నాడట. అందుకు తగ్గట్లే పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానితో ఫోటో దిగిన తారక్.. అందులో కాస్త సన్నబడి ఎప్పటిలాగే బియర్డ్ లుక్ లో కూల్ గా కనిపిస్తున్నాడు. మరి కొరటాల ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

×