Kangana Ranaut : స్వలింగ సంపర్క వివాహానికి సపోర్ట్ చేస్తూ కంగనా వ్యాఖ్యలు..

తాజాగా స్వలింగ సంపర్క వివాహంపై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. హరిద్వార్ లో గంగా పుష్కరాలలో పాల్గొన్న కంగనా మీడియాతో మాట్లాడింది.

Kangana Ranaut : స్వలింగ సంపర్క వివాహానికి సపోర్ట్ చేస్తూ కంగనా వ్యాఖ్యలు..

Kangana Ranaut comments on supporting LGBTQ Marriage

Kangana Ranaut :  బాలీవుడ్(Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రస్తుతం వుమన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇక దేశం, ధర్మం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తనని ఎవరన్నా విమర్శించినా ఫైర్ అవుతుంది. బాలీవుడ్ సినిమా మాఫియాపై ఓపెన్ గానే అందరిపై విమర్శలు చేస్తూ, సోషల్ మీడియాలో(Social Media) కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇక దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది కంగనా.

తాజాగా కంగనా రనౌత్ స్వలింగ సంపర్క వివాహానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొంతలకాలంగా స్వలింగ సంపర్క వివాహానికి చట్టబద్దత కలిపించాలని LGBTQ వ్యక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఇది ప్రభుత్వం ఒప్పుకోకుండా మేము సొంత నిర్ణయాలు తీసుకోలేమని, మతానికి సంబంధించినవి కాబట్టి ప్రభుత్వ వాదనలు కూడా ఉండాలని న్యాయమూర్తులు అనడంతో కొన్ని రోజులుగా స్వలింగ సంపర్క వివాహానికి సంబంధించి కేసు వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా స్వలింగ సంపర్క వివాహంపై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. హరిద్వార్ లో గంగా పుష్కరాలలో పాల్గొన్న కంగనా మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో పలు అంశాల గురించి మాట్లాడగా మీడియా ప్రతినిధులు స్వలింగ సంపర్క వివాహం గురించి అడగగా కంగనా రనౌత్ దీని గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రేమ, హృదయానికి సంబంధించిన విషయం. రెండు హృదయాలు కలిసినప్పుడు అవి ఎవరైతే ఏంటి, మనం ఏం చెప్పగలం అని మాట్లాడుతూ స్వలింగ సంపర్క వివాహానికి మద్దతు తెలిపింది.

Ramabanam Movie : ఇదెక్కడి ప్రమోషన్స్ రా నాయనా.. పాల ప్యాకెట్లు, చలివేంద్రాలతో రామబాణం ప్రమోషన్స్..

దీనిపై పలువురు LGBTQ వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగనాకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఓ LGBTQ వ్యక్తి, పలువురు కంగనా ఫ్యాన్స్ ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఏ బాలీవుడ్ నటులు మాట్లాడలేని టాపిక్ ని ధైర్యంగా మాట్లాడింది కంగనా అంటూ అభినందిస్తున్నారు. దీంతో కంగనా చేసిన వ్యాఖ్యలు ప్ర్రస్తుతం వైరల్ గా మారాయి.