KGF2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా?

వీకెండ్ కాదు.. నార్మల్ వీక్ డేస్ లోనూ రాఖీబాయ్ తగ్గేదే లే అంటున్నాడు. చూస్తుంటే ఇప్పట్లో కేజీఎఫ్2 మ్యానియాకి బ్రేక్ పడేలా లేదు.

KGF2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా?

KGF2

KGF2: వీకెండ్ కాదు.. నార్మల్ వీక్ డేస్ లోనూ రాఖీబాయ్ తగ్గేదే లే అంటున్నాడు. చూస్తుంటే ఇప్పట్లో కేజీఎఫ్2 మ్యానియాకి బ్రేక్ పడేలా లేదు. లాంగ్ రన్ కి పుష్కలమైన అవకాశాలున్న ఈ సినిమాతో పోటీ పడేందుకు మిగిలిన హీరోలు రంగంలోకి దిగుతారా.. మరోసారి మా సినిమా వాయిదా అంటారా.. ఏం జరుగుబోతుంది..?

KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ 550 కోట్లు రాబట్టి మిగిలిన మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు ప్రశాంత్ నీల్. వీకెండ్ లోనే కాదు సోమవారం ఒక్కరోజే బాలీవుడ్ లో 26 కోట్లు సాధించి కేజీఎఫ్ చాప్టర్2 అబ్బురపరిచింది. నార్మల్ డేస్ లోనూ ఇండియా వైడ్ హౌజ్ ఫుల్ బోర్డులు పడటం చూస్తుంటే రాఖీభాయ్ హవా ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు. కేజీఎఫ్2తో పోటీపడి బీస్ట్ సొంత రాష్ట్రంలోనే గల్లంతైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్ వీక్ తర్వాత వద్దామనుకున్న సినిమాలకు కూడా రాఖీ బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తుంది.

KGF2: కేజీయఫ్ 2.. నైజాంలో మండే టెస్ట్ పాస్!

టాలీవుడ్ లో ఏప్రిల్ 29 వరకు కేజీఎఫ్2కు అడ్డుకట్ట వేయలేరు. ఏప్రిల్ 22న రిలీజ్ అనుకున్న సినిమాలన్నీ ఇప్పటికే పోస్ట్ పన్ అని ప్రకటించేసాయి. ఒకటి అరా చిన్న సినిమాలొచ్చినా కేజీఎఫ్ కి ఫరక్ పడదు. ఇక లాంగ్ రన్ లో దూకుడు చూపించి ఏప్రిల్ 29 వరకు కూడా థియేటర్స్ లో యశ్ మూవీ సందడి చేస్తే.. ఆచార్యతో పోటీపడక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో మెగాఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా కాబట్టి ఆచార్యకు ఓపెనింగ్స్ అదిరే అవకాశముంది.

KGF2: కేజీఎఫ్ ప్రకంపనలు.. ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్స్!

బాలీవుడ్ లో ఎప్పుడూలేని రికార్డులు బద్దలుకొడుతుంది కేజీఎఫ్ ఛాప్టర్2. ఈ సినిమాకు పోటీ వద్దనుకునే ఏప్రిల్ 22కు షిఫ్ట్ అయింది షాహిద్ కపూర్ జెర్సీ. ఇప్పుడు చూస్తే నార్త్ ప్రేక్షకులు రాఖీబాయ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఏప్రిల్ 22 వరకు ఆ సందడి ఖచ్చితంగా కంటిన్యూ అవుతోంది. అందుకే ఏప్రిల్ 22న రావాలనుకున్న షాహిద్ అండ్ టీమ్ మరోసారి ఆలోచనలో పడింది.

KGF2: కేజీఎఫ్2 కలెక్షన్ల సునామీ.. బాలీవుడ్ లో రాఖీభాయ్ హవా!

జెర్సీ ఏప్రిల్ 29కి వెళ్తే.. ఆరోజును ఆల్రెడీ టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగణ్ ఫిక్స్ చేసుకున్నారు. హీరోపంతి2, రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ 29ని బుక్ చేసుకున్నాయి. సో బాలీవుడ్ లో మూడు సినిమాలు ఒకే రోజు వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చినా అప్పటికి కూడా వీటికి కేజీఎఫ్2 పోటీ ఇస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో బాలీవుడ్ మేకర్స్ కి ప్రశాంత్ నీల్ సినిమా కొరకరాని కొయ్యలా తయారైంది. బాలీవుడ్ రికార్డ్ ఓపెనర్, రికార్డ్ వీకెండ్, బిగ్గెస్ట్ సింగిల్ డే, బిగ్గెస్ట్ సన్ డే, బిగ్గెస్ట్ సెకండ్ డే ఇలా.. రకరకాల రికార్డ్స్ కొల్లగొడుతున్న కేజీఎఫ్ ని ఇప్పట్లో ఎదుర్కోవడం కష్టమే. మరి రన్ వే34, హీరోపంతి మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

KGF2: కేజీయఫ్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సలాం రాఖీ భాయ్!

తమిళ్ లో కూడా సంచలనాలకు తెరదీస్తున్నాడు ప్రశాంత్ నీల్. తన సినిమాతో మిగిలిన వారికి నిద్రలేకుండా చేస్తున్నాడు. ఏప్రిల్ 21న ఓ మై డాగ్, ఏప్రిల్ 28న కాదు వాక్కుల రెండు కాదల్ సినిమాలు రిలీజ్ కి రెడీఅయ్యాయి. విజయ్ సేతుపతి, సామ్, నయనతార.. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో నటించిన కాదువాక్కుల రెండు కాదల్ మూవీపై పాజిటివ్ హోప్స్ తమిళ్ మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఆల్రెడీ రంగంలో ఉన్న రాఖీభాయ్ ఆ ఆటలు సాగనిస్తాడో లేదో చూడాలి.