Khiladi: ధైర్యంగా థియేటర్లకి ఖిలాడీ.. మాస్ రాజాకి ఇంత నమ్మకమేంటి?

కరోనా వేవ్ ఇంకా పూర్తి తగ్గపోలేదు.. ఏపిలో థియేటర్ల ఆంక్షలు ఎత్తేయలేదు.. అయినా గట్టి నమ్మకంతో అప్పుడెప్పుడో ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ కే స్టిక్కయ్యాడు మాస్ రాజ రవితేజ.

Khiladi: ధైర్యంగా థియేటర్లకి ఖిలాడీ.. మాస్ రాజాకి ఇంత నమ్మకమేంటి?

Khiladi

Khiladi: కరోనా వేవ్ ఇంకా పూర్తి తగ్గపోలేదు.. ఏపిలో థియేటర్ల ఆంక్షలు ఎత్తేయలేదు.. అయినా గట్టి నమ్మకంతో అప్పుడెప్పుడో ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ కే స్టిక్కయ్యాడు మాస్ రాజ రవితేజ. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా ఖిలాడి అయినా కూడా అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తున్నాడు. అసలు రవితేజ ధైర్యమేంటి? ఆయన ఆడియన్స్ కివ్వబోయే కిక్కేంటి? అన్నది ఆసక్తిగా మారింది.

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

కరోనా భయంతో ఏపిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఆంక్షలతో హీరోలంతా రిలీజ్ లు వాయిదా వేసుకోవాలనో సేఫ్ సైడ్ రెండు రిలీజ్ డేట్లు బ్లాక్ చేసుకోవాలనో చూస్తుంటే మాస్ రాజ రవితేజ మాత్రం గట్స్ చూపిస్తున్నాడు. ఒక్కసారి ఫిక్సయితే తగ్గేదేలే అన్నట్టు తన డేరింగ్ డెసిషన్ తో ఫాన్స్ కు ఫుల్లు కిక్కిస్తున్నాడు. రమేష్ వర్మతో చేస్తున్న ఖిలాడి మూవీ రిలీజ్ డేట్ ను ఒక్కసారే ఫిక్సయ్యాడు. ఎన్ని ఆంక్షలెదురైనా డేట్ మాత్రం మార్చలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 11న ఖిలాడి రిలీజ్ చేసి మాస్ రాజ స్మార్ట్ ప్లే చేయబోతున్నాడు.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

ఖిలాడి ప్రమోషన్స్ విషయంలో తగ్గట్లేదు దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ ఆల్బమ్ నుంచి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసి, ఆల్బమ్ ను హిట్ చేశారు. రవితేజ ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతో యంగ్ హీరోలకే సవాల్ విసురుతున్నాడు. రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఉత్సాహంగా చేస్తున్నారు. మరో కీలక పాత్రలో అర్జున్ యాక్షన్ తో ఎట్రాక్ట్ చేయనున్నాడు. రమేష్ వర్మ, రవితేజ కాంబోలో గతంలో వీరా వచ్చి యావరేజ్ సక్సెస్ ను అందుకుంది. సో ఇప్పుడు హిట్ కొట్టాలన్న కసితో భారీ బడ్జెట్ తో ఖిలాడి చేస్తున్నారు రమేశ్ వర్మ, రవితేజ.

F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

చాలా కాలం ఫేయిల్యూర్స్ వెంటాడిన రవితేజ క్రాక్ తో కంబ్యాక్ అయ్యాడు. ఆ సక్సెస్ వేవ్ కు బ్రేక్ ఇవ్వకూడదనే కరోనా వేవ్ ను లెక్క చేయకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ధైర్యంగా రిలీజ్ డేట్లూ ఫిక్స్ చేసుకుంటున్నాడు అంటున్నారు విశ్లేషకులు. టీజర్, ట్రయిలర్, సాంగ్స్ ను చూస్తేనే అర్థమవుతుంది రవితేజ కెరీర్ లోనే ఖిలాడి బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు ఫాన్స్. ఎన్ని సినిమాలు పోటీకొచ్చిన తన సెటె ఆఫ్ ఆడియన్స్ తనకుంటారన్న ధైర్యంతో ఒకటే రిలీజ్ డేట్ ను ఫిక్సయ్యాడు మాస్ రాజ్ రవితేజ.