RRR: కొమురం భీముడో… వచ్చేస్తున్నాడో!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే....

RRR: కొమురం భీముడో… వచ్చేస్తున్నాడో!

Komuram Bheemudo Full Video Song To Be Released Tomorrow

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అన్ని భాషల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వసూళ్ల పరంగా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

RRR: చౌరస్తాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఇప్పట్లో కష్టమే!

ఇక ఈ సినిమా నుండి వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్, తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న వాటిలో ఈ పాట కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఈ పాటలో హీరోల ఎక్స్‌ప్రెషన్స్.. ముఖ్యంగా తారక్ ఈ పాటలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడని అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఆయన యాక్టింగ్‌కు సెల్యూట్ చేశారు. అటు చరణ్ కూడా తన కోపాన్ని, బాధను, బాధ్యతను కలగలిపి ఒకేసారి పలికించిన విధానం ఈ పాటకు ప్రాణం పోసిందని ఈ పాటను చూసిన వారు అంటున్నారు.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

సింగర్ కాళభైరవ పాడిన ఈ పాటను సుద్ధాల అశోక్ తేజ రచించగా, కీరవాణి అద్భుతమైన ట్యూన్ అందించాడు. ఇక ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో సాంగ్‌ను ఏప్రిల్ 6న సాయంత్రం 4 గంటలకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి ఈ పాట యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డు వ్యూస్ అందుకుంటుందో చూడాలి. ఇక త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుండటంతో ఈ సినిమా ఓటీటీలోనూ సంచలనం క్రియేట్ చేస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.