Mail Movie: అరుదైన ఘనతకెక్కిన తెలుగు సినిమా!

Mail Movie: అరుదైన ఘనతకెక్కిన తెలుగు సినిమా!

Mail Movie

Mail Movie: ఆహా ఓటీటీలో విడుదలైన కంబాలపల్లి కథలు ‘మెయిల్‌’ చిత్రం ‘న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021’కు ఎంపికైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అర్హత దక్కించుకున్న మరో తెలుగు సినిమాగా ఘనత దక్కించుకుంది.

.జూన్‌ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్‌ నిర్మించారు.

ఆవకాయలో నెయ్యేసుకుని అన్నం తింటే నాలుకకు ఎంత రుచి వస్తుందో? ఈ సినిమా చూస్తే అంత తృప్తి కలుగుతోంది అన్నట్లుగా ఉంది. పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెగ్యులర్ ఫార్ములాలు ఏం లేవు.. నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. అందులో ఓ ఐటమ్ సాంగ్ అనే పద్దతులు అసలే కనిపించవు..

కంబాలప‌ల్లి క‌థ‌ల్లో ఓ కథ రివ్యూ!

కంటి నిండా ఆనందం.. కడుపుబ్బ నవ్వు.. కంప్యూటర్ పై హీరోకి ఉన్న ఇష్టం.. అందుకు సంబంధించిన కోర్సు నేర్చుకోవడానికి పడే తాపత్రయం.. ఆ రోజుల్లో పరిస్థితులు దర్శకుడు చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు. తెలంగాణ యాస, బాసను ఎక్కడా తక్కువ చెయ్యకుండా.. సహాజమైన పదాలను వాడుకుంటూ రాసిన డైలాగులు మెప్పిస్తాయి. ఈ సినిమాకు అరుదైన గుర్తింపు దక్కడం విశేషం.