సొంత కథను రెడీ చేసుకునే పనిలో మెగా మేనల్లుడు

సొంత కథను రెడీ చేసుకునే పనిలో మెగా మేనల్లుడు

సొంత కథను రెడీ చేసుకునే పనిలో మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయినా తనకంటూ సొంత ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్‌ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట సాయి ధరమ్‌ తేజ్‌. ‘నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో ఎప్పుడు వస్తుందో’ అంటూ చిత్ర లహరి టీజర్‌తో సందడి చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఓ లైన్‌ను సిద్ధం చేసుకున్న సాయి, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Read Also : మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!

ప్రస్తుతం  ‘నేను శైల‌జ’ ఫేమ్ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రలహరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ ‘చిత్ర లహరి’ మూవీలో గుబురు గడ్డంతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు సాయి ధరమ్.. పాత్ర కోసం గడ్డం పెంచాడా లేక రచయితగా మారాను అని సింబాలిక్‌గా చెప్పడం కోసం గెడ్డం పెంచాడో చూడాలి. 

×