Naga Chaitanya: చైతూ 22.. పోలీస్ పాత్రలో రెచ్చిపోనున్న అక్కినేని బుల్లోడు!

అక్కినేని నాగచైతన్య లాస్ట్ మూవీ ‘థ్యాంక్యు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా, అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా తరువాత చైతూ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తాజాగా చైతూ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Naga Chaitanya: చైతూ 22.. పోలీస్ పాత్రలో రెచ్చిపోనున్న అక్కినేని బుల్లోడు!

Naga Chaitanya NC22 Movie Update Poster

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య లాస్ట్ మూవీ ‘థ్యాంక్యు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా, అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా తరువాత చైతూ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తాజాగా చైతూ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు.. మ్యాన్స్ వరల్డ్ ఇండియా మ్యాగజైన్ కోసం నాగచైతన్య స్పెషల్ ఫొటోషూట్

చైతూ కెరీర్‌లో 22వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్టర్ చూస్తే, ఈ సినిమాలో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Naga Chaitanya : థియేటర్ ఏమైపోతుంది అన్నారు.. నాతో అయిదు నిమిషాల ఫైట్ చేసే క్యారెక్టర్ నుండి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‍‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంర్ రాజా సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాలో చైతూ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా.. ఈ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.