Nani – Vishwaksen : నాని, విశ్వక్ సేన్.. పాన్ ఇండియా సినిమాలతో వారం గ్యాప్‌తో గ్రాండ్ ఎంట్రీ

న్యాచురల్ స్టార్ నాని, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇద్దరూ తమ నెక్స్ట్ మూవీస్ తో ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇద్దరి సినిమాలూ ఈ నెల్లోనే రిలీజ్. అందుకే ఆ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాల్ని...................

Nani – Vishwaksen : నాని, విశ్వక్ సేన్.. పాన్ ఇండియా సినిమాలతో వారం గ్యాప్‌తో గ్రాండ్ ఎంట్రీ

Nani and Vishwaksen coming with their first pan indian movies Dasara and Das Kaa Dhamki Movies

Nani – Vishwaksen :  న్యాచురల్ స్టార్ నాని, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇద్దరూ తమ నెక్స్ట్ మూవీస్ తో ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇద్దరి సినిమాలూ ఈ నెల్లోనే రిలీజ్. అందుకే ఆ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాల్ని జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు.

న్యాచురల్ స్టార్ గా పూర్తిస్థాయిలో నటుడిని బయట పెట్టేందుకు నాని ‘దసరా’ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ నెల 30న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ వరకు క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఊర మాస్ గెటప్ లో నాని పర్ఫార్మెన్స్, స్ర్కీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ సినిమా కోసం నాని ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నాడు. వివిధ లొకేషన్స్ లో సినిమాను ప్రమోట్ చేస్తూ దసరాను జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలంగాణ నేటివిటీ, ఫైట్స్, పాటలు అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి దసరా మూవీలో. నాని కూడా ఊరమాస్ అవతారంలో సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంటెంట్ బాగుండటం, నాని లుక్​తో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయినా నాని ‘దసరా’ను ఇంకా ప్రమోట్ చేస్తున్నాడు. హిందీ రిలీజ్​ను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్​ను ఉత్తర్​ప్రదేశ్​లోని లక్నోలో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తమిళనాడును కూడా ఓ రౌండేశాడు నాని. ఈ విధంగా ఎక్కడా తగ్గేదేలే అంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

 

యంగ్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యేది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. మొత్తానికి ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ ఎలివేట్ కాబోతున్నాయి. హై రేంజ్ బడ్జెట్‌తో రిచ్ నెస్ తో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ హీరో, డైరెక్టర్ నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ సినిమా ను విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. భారీ ఎత్తున, దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి తీసిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 17న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికి యంగ్ టైగర్ యన్టీఆర్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.

Richard Carpenter : ఆస్కార్ విన్నింగ్ పై కీరవాణికి స్పెషల్ సాంగ్ డెడికేట్ చేసిన అమెరికన్ టాప్ మ్యుజిషియన్

మొత్తానికి నాని, విశ్వక్ సేన్ ఇద్దరూ తమ పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ తో సినిమాల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. దసరా, దాస్ కా ధమ్కీ సినిమాలు రెండు ఆయా హీరోలకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీస్ కావడంతో ఇద్దరు హీరోలు ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. సరిగ్గా ఎనిమిది రోజుల తేడాతో రిలీజ్ కాబోతున్న దసరా, దాస్ కా ధమ్కీ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి మరి. ఈ రెండు సినిమాలు వాళ్ళ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం. నాని దసరా సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ లో రిలీజ్ కాబోతుంటే దాస్ కా ధమ్కీ సినిమా మాత్రం కన్నడ తప్ప మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతుంది.