NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న తారక్..? | NTR To Team Up With A Tamil Director

NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో.....

NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న తారక్..?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించాడు. అయితే ఈ సినిమా తరువాత తారక్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే తన కెరీర్‌లోని 30, 31వ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేశాడు ఈ హీరో.

NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని కేజీయఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ మరోసారి తనదైన మార్క్ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

NTR31: ఎన్టీఆర్ మళ్లీ అలా కనిపిస్తాడా?

ఇక ఈ సినిమాల తరువాత కూడా తారక్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే తమిళ దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన ఓ స్టోరీలైన్ బాగా నచ్చడంతో, ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేయాల్సిందిగా తారక్ గతంలోనే చెప్పాడట. దీంతో వెట్రిమారన్ ఇప్పుడు ఆ కథను పూర్తిగా రెడీ చేసి తారక్‌కు వినిపించేందుకు సిద్ధమయ్యాడట. అయితే వెట్రిమారన్‌పై పూర్తి నమ్మకంతో తారక్ ఆయనకు ఓకే చెప్పడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో వెట్రిమారన్ స్పెషలిస్ట్. అందుకే, ఆయన తెరకెక్కించే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి నిజంగానే వెట్రిమారన్ కథకు తారక్ ఓకే చెబుతాడా.. ఒకవేళ చెబితే, ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా అనేది వేచి చూడాలి.

×