Pawan Kalyan : హరిహర వీరమల్లు.. రెండు విభిన్న పాత్రల్లో పవర్ స్టార్

'హరిహర వీరమల్లు' పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా.............

10TV Telugu News

Pawan Kalyan :   ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి ‘భీమ్లా నాయక్’ సినిమా రాబోతుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతుంది. ఇప్పుడు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.

‘హరిహర వీరమల్లు’ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించనున్నారు. ఇందులో ఓ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

Chiaranjeevi : జగన్‌తో చిరు భేటీ‌పై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఇవాళ హీరో సినిమాతో నిధి ప్రేక్షకులని పలకరించనుంది. దీంతో గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉంది నిధి అగర్వాల్. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిధి అగర్వాల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. ఇది పూర్తిగా పీరియాడిక‌ల్ సినిమానే అయినా రెండు కాలాల్లో జ‌రిగే క‌థ అని తెలిపింది. అప్ప‌టి కాలానికి, ఇప్ప‌టి కాలానికి ముడిపెడుతూ సినిమా ఉండ‌బోతుంద‌ని చెప్పింది. నిధి చెప్పినట్టు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియోతో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నిధి చెప్పిన మాటల్ని బట్టి సినిమాపై మరోసారి అంచనాలు పెరిగాయి.

×