RRR: ప్రమోషన్ పాటలో ప్రభాస్, రానా, అనుష్క.. నిజమేంటంటే?

రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు.

RRR: ప్రమోషన్ పాటలో ప్రభాస్, రానా, అనుష్క.. నిజమేంటంటే?

Rrr

RRR: రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు. అందుకే సినిమా యూనిట్ కూడా ప్రమోషన్స్ లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇందుకోసం ఏకంగా ఓ స్పెషల్ టీంను కూడా బిల్డప్ చేసిన రాజమౌళి సినిమాతో సమానంగా ప్రమోషన్ మీద దృష్టి పెట్టాడు.

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ నుండి మేకింగ్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వచ్చిన క్షణాల్లోనే భారీ వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మేకింగ్ సాంగ్ రాబోతుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి కసరత్తులు మొదలుకాగా.. ఇందులో గతంలో రాజమౌళితో పనిచేసిన మిగతా హీరోలు కూడా కనిపిస్తారని ఓ ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ గతంలో రాజమౌళితో పనిచేసిన వారేనన్న సంగతి తెలిసిందే.

ఇక బాహుబలి క్యాస్టింగ్ ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు రవితేజ, నానీ, నితిన్, సునీల్ కూడా ఈ వీడియోలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది ఏ మాత్రం నిజం కాదని యూనిట్ చెప్తుంది. కేవలం ఈ ప్రమోషన్ పాటలో ఆర్ఆర్ఆర్ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ తో పాటు ఇందులో భాగమైన నటీనటులు మాత్రమే కనిపిస్తారని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.