The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఈ సినిమాపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. అయితే అందరూ ఈ సినిమాని అభినందిస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం డిఫరెంట్ గా ట్వీట్ చేశారు. ఓ థియేటర్ లో సినిమా చూసిన తర్వాత.......

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj

Prakash Raj :  ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో నిర్మితమై రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది ఈ సినిమా. 1990లలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కలిసి కశ్మీర్ లో హిందువులపై చేసిన మారణకాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. అయితే అందరూ ఈ సినిమాని అభినందిస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం డిఫరెంట్ గా ట్వీట్ చేశారు. ఓ థియేటర్ లో సినిమా చూసిన తర్వాత ఓ ప్రేక్షకుడు సినిమా నుంచి నిజాలు తెలుసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ మాట్లాడిన ఓ వీడియో బైట్ ని షేర్ చేస్తూ.. ”కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు.

Abhishek Agarwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే తెలుగు డబ్బింగ్.. 10 టీవీతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వ్యూ..

అయితే కొంతమంది నెటిజన్లు ఈ ట్వీట్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పాకిస్తాన్, ఉగ్రవాదుల్ని నెగిటివ్ గా చూపిస్తుంటే మీరు సినిమాని ఎలా వ్యతిరేకిస్తున్నారు?, మీరు సినిమా పరిశ్రమ అయ్యిండి సినిమాని సినిమాలా చూడలేరా? నిజాల్ని చెపితే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు/ ఆ వీడియో మీరే వెనకాల నుంచి తీశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.