RRR : ఆస్కార్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన RRR టీం.. జై హింద్ అంటూ రాజమౌళి..

దర్శకదీరుడు రాజమౌళి తన పట్టుదలతో ఆస్కార్ అందుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. అసలు తెలుగు వారి ఊహల్లో కూడా లేని ఆస్కార్ వరకు RRR ని తీసుకు వెళ్లి, అక్కడ ఇంటర్నేషనల్ చిత్రాల పై పోటీకి కాలు దువ్వి.. ఆస్కార్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెలుగు వాడి సత్తా ఏంటో రాజమౌళి తెలిసేలా చేశాడు.

RRR : ఆస్కార్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన RRR టీం.. జై హింద్ అంటూ రాజమౌళి..

rajamouli and keeravani reached hyderabad with oscar award

RRR : దర్శకదీరుడు రాజమౌళి తన పట్టుదలతో ఆస్కార్ అందుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. అసలు తెలుగు వారి ఊహల్లో కూడా లేని ఆస్కార్ వరకు RRR ని తీసుకు వెళ్లి, అక్కడ ఇంటర్నేషనల్ చిత్రాల పై పోటీకి కాలు దువ్వి.. ఆస్కార్ అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెలుగు వాడి సత్తా ఏంటో రాజమౌళి తెలిసేలా చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టార్రర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధారణ పొందింది. ఆస్కార్ కి వెళ్లే అన్ని అర్హతులు ఉన్నా, భారత్ ప్రభుత్వం మాత్రం RRR ని పక్కన పెట్టి గుజరాతీ సినిమాని ఆస్కార్ కి పంపించింది. కానీ ఆ సినిమా ఆస్కార్ బరిలో నిలవలేక వెనక్కి వచ్చేసింది.

RRR : నాటు నాటు సాంగ్ గురించి చంద్రబోస్‌తో టామ్ క్రూజ్ ఏమన్నాడో తెలుసా?

ఇక RRR ని అధికారికంగా ఆస్కార్ కి పంపించకపోయినా రాజమౌళి నిరుత్సాహ పడలేదు. తన సత్తువు మీద తనకి నమ్మకం ఉండడంతో, పట్టు వదలని విక్రమార్కుడిలా.. ఆస్కార్ లో స్థానం దక్కించుకునేందుకు పోరాడాడు. ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన RRR లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి ఎంపిక అయ్యింది. పోటీ బరిలో వరల్డ్ టాప్ స్టార్స్ ఉన్నా, వారందర్ని గెలిచి నాటు నాటుకి ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. ఆస్కార్ వేడుకలు ముగియడంతో, ఇటీవలే ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు.

RRR : RRR సీక్వెల్ పనులు వేగవంతం చేసాం.. అమెరికన్ మీడియాతో రాజమౌళి!

తాజాగా నేడు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో హైదరాబాద్ లో దిగిన RRR టీంకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సింగర్ కాలభైరవ మాట్లాడుతూ.. ఆస్కార్ అందుకోవడం, స్టేజి పై సాంగ్ పెర్ఫార్మ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటు చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి ‘జై హింద్’ అనే ఒక్క మాటతో అందరి మనసులను దోచుకున్నాడు. కాగా రామ చరణ్ స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాం ఉండడంతో డైరెక్ట్ ఢిల్లీ చేరుకున్నాడు.