Rajamouli : ఇది అమెరికాలా లేదు.. అమీర్‌పేట్‌లా ఉంది..

తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ కి రాజమౌళి హాజరయ్యారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా అక్కడ RRR సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమా చూడటానికి జనం విపరీతంగా వచ్చారు. ఎంట్రీ కోసం.................

Rajamouli : ఇది అమెరికాలా లేదు.. అమీర్‌పేట్‌లా ఉంది..

Rajamouli :  రాజమౌళి బాహుబలి సినిమాతో మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా మన గొప్పతనాన్ని చాటాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు.. చాలా మంది RRR సినిమాని అభినందించారు. హాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంటున్నారు. అక్కడ మీడియాతో ముచ్చటిస్తున్నారు.

తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ కి రాజమౌళి హాజరయ్యారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా అక్కడ RRR సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమా చూడటానికి జనం విపరీతంగా వచ్చారు. ఎంట్రీ కోసం క్యూలైన్ లో చాలా మంది నిల్చున్నారు. మన దేశం వాళ్ళతో పాటు అమెరికా, వివిధ దేశాల ప్రజలు కూడా చాలా మంది వచ్చారు RRR సినిమాని, రాజమౌళిని చూడటానికి. ఈ సినిమా ప్రదర్శన అయ్యాక రాజమౌళి అక్కడ మీడియాతో, ప్రేక్షకులతో మాట్లాడారు.

Nagarjuna : కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను.. త్వరలో ఓటీటీలోకి కూడా వస్తాను..

రాజమౌళి బియాండ్ ఫెస్ట్ లో వచ్చిన జనాల్ని చూసి మాట్లాడుతూ.. ఇది అమెరికాలా లేదు. నా హోమ్ టౌన్ హైదరాబాద్ లో ఉండే ఓ ప్లేస్ అమీర్‌పేట్‌లా ఉంది. ఇక్కడ సినిమా చూస్తుంటే ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ అలాగే ఉంది అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అక్కడ RRR సినిమాని, రాజమౌళిని చూడటానికి వచ్చిన జనాల్ని చూసి సరదాగా రాజమౌళి ఇలా వ్యాఖ్యానించారు.

 

View this post on Instagram

 

A post shared by Meme Raja (@meme_raaja)