RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రమోషన్లలో సల్మాన్ ఖాన్ సపోర్ట్.. నార్త్‌లో భారీ స్థాయిలో విడుదల..

10TV Telugu News

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ మెయిన్ లీడ్స్‌గా.. దర్శకధీరుడు రామమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం..

RRR Mass Anthem : ఈ ఊపు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, చరణ్, తారక్ టీజర్లకు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ‘నాటు నాటు’ పాట నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయ్యింది.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

రిలీజ్‌కి మరో 48 రోజులు మాత్రమే టైం ఉంది. దీంతో ప్రమోషన్స్ మీద ఫుల్ ఫోకస్ చేశారు జక్కన్న. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించి బాలీవుడ్‌ వర్గాలవారు ఆశ్చర్యపోయేలా చేశారాయన. శుక్రవారం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ని కలిశారు రాజమౌళి. ఆయనతో కొడుకు కార్తికేయ కూడా ఉన్నారు.

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

హిందీ ప్రమోషన్లలో హెల్ప్ చెయ్యాల్సిందిగా జక్కన్న అడగడంతో.. సల్లూ భాయ్ తప్పకుండా సపోర్ట్ చేస్తానని మాటిచ్చారని సమాచారం. సల్మాన్ ఖాన్‌ను కలిసి ముంబై ఫిలిం సిటీలోనుండి జక్కన్న, కార్తికేయ బయటకు వస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చెయ్యబోతున్నారు.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

×