RRR : మహిళా సంఘాలు కట్టిన థియేటర్.. కొమరం భీం మనవడితో కలిసి సినిమా చూసిన రాజమౌళి

రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. ''ఆదివాసి గిరిజన హక్కుల కోసం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం పుట్టిన ప్రాంతంలో నేను పర్యటించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న...........

RRR : మహిళా సంఘాలు కట్టిన థియేటర్.. కొమరం భీం మనవడితో కలిసి సినిమా చూసిన రాజమౌళి

Rajamouli

 

Rajamouli :  కొమరం భీం కథ ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లని కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డైరెక్టర్ రాజమౌళి, అయన సతీమణి, మరి కొంతమంది చిత్ర యూనిట్ తో కలిసి కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాన్ని సందర్శించారు. మహిళా సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన థియేటర్ ని సందర్శించడానికి రాజమౌళి ఆసిఫాబాద్ వెళ్లారు.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాజమౌళికి, రమా రాజమౌళికి ఆర్ అండ్ బి గెస్ట్‌ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం స్వాగతం పలికారు. డైరెక్టర్ దంపతులకు మొక్కలను అందజేశారు. ఆసిఫాబాద్ లో మహిళా సంఘాలు కలిసి కొమరం భీం అనే ఓ బెలూన్ థియేటర్ ని ప్రారంభించారు. ముందుగా థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన కొమురంభీం చిత్రపటానికి అంజలి ఘటించారు రాజమౌళి దంపతులు. రాజమౌళి దంపతులకు ఆదివాసి గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. ఆ తర్వాత థియేటర్లో కొమురం భీం మనవడు సోనేరావు, మరికొంతమంది గిరిజనులతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని వీక్షించారు.

Kadambari Kiran : బంగారు స్పూన్‌తో పుట్టడం వేరు.. బంగారు మనసుతో బతకడం వేరు.. చరణ్ మంచితనంపై ప్రశంసలు

సినిమా చూసిన తర్వాత రాజమౌళి మీడియాతో మాట్లాడారు. రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. ”ఆదివాసి గిరిజన హక్కుల కోసం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం పుట్టిన ప్రాంతంలో నేను పర్యటించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. కానీ ఇలా అతి తక్కువ వ్యయంతో నిర్మించిన థియేటర్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మహిళలు ఈ థియేటర్ ని నిర్మించడం గర్వకారణం. వారిని చూస్తుంటే ఈర్ష కలుగుతుంది. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్యం అనే విషయం మరోసారి రుజువు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి థియేటర్లు మరిన్ని నిర్మించాలి” అని అన్నారు.