Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్-3 రామ్‌చరణ్‌తో ప్రారంభం అవ్వబోతుందా.. ఆహా కంటెట్ హెడ్ ఏమన్నాడు?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రలో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకుంది. సీజన్-2 లాస్ట్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. అయితే ప్రేక్షకులు అంతా ఇప్పుడు అన్‌స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తున్నారు. సీజన్-3 ని ఎవరితో ప్రారభించబోతున్నారు అంటూ అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విషయం గురించి ఆహా కంటెట్ హెడ్ ని 10టీవీ ప్రతినిధి ప్రశ్నించగా, బదులిచ్చాడు..

Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్-3 రామ్‌చరణ్‌తో ప్రారంభం అవ్వబోతుందా.. ఆహా కంటెట్ హెడ్ ఏమన్నాడు?

Unstoppable ram charan

Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రలో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకుంది. మొదటి సీజన్ ని సినిమా ప్రముఖలతో నడిపించిన నిర్వాహకులు, సెకండ్ సీజన్ ని సినీ, రాజకీయ వ్యక్తులను అతిధులుగా తీసుకు వచ్చి సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ సీజన్ ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీసుకు వచ్చే మొదటి ఎపిసోడ్ తోనే సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియజేశారు.

Unstoppable 2: తమ్ముడు సినిమాలో అంతా డూపా.. బాలయ్య ప్రశ్నకు పవన్ ఏమన్నాడంటే..?

ఇక ఈ సీజన్ ఎండింగ్ ని అంతకుమించి ప్లాన్ చేశారు. సినీ, రాజకీయవేత్త అయిన పవన్ కళ్యాణ్ ఈ లాస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులు అంతా ఇప్పుడు అన్‌స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తున్నారు. సీజన్-3 ని ఎవరితో ప్రారభించబోతున్నారు. ఆ సీజన్ థీమ్ ఎలా ఉండబోతుంది అంటూ అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సీజన్-3 మొదటి ఎపిసోడ్ కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రాబోతున్నాడు అంటూ, తనతో పాటు తెలంగాణ మంత్రి కేటిఆర్ కూడా హాజరు అవుతాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం గురించి ఆహా కంటెట్ హెడ్ ని 10టీవీ ప్రతినిధి ప్రశ్నించగా, బదులిచ్చాడు.. ‘మొదటి సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ లో సెకండ్ సీజన్ ఉంటుంది అంటూ బాలకృష్ణ గారు హింట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ సీజన్ ఎండింగ్ లో కూడా మూడో సీజన్ కి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నారు. అప్పటి వరకు ఎదురు చూడండి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకి ప్రసారం కానుంది. ప్రభాస్ ఎపిసోడ్ సమయంలో ఓవర్ ట్రాఫిక్ వాళ్ళ యాప్ క్రాష్ అయ్యింది. ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆహా టీం వెల్లడించింది.