RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

తాజాగా తమిళ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్‌.ఎన్‌.ఆర్‌ మనోహర్ మరణంతో తమిళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

RNR Manohar :  ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

Rnr Manohar

RNR Manohar :  గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే కన్నడ పరిశ్రమలో పునీత్ మరణం అందర్నీ కలవర పెట్టింది. ఆ తర్వాత మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద మరణం మలయాళ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. తాజాగా తమిళ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్‌.ఎన్‌.ఆర్‌ మనోహర్ మరణంతో తమిళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌.ఎన్‌.ఆర్‌ మనోహర్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మనోహర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. మనోహర్ మరణవార్త తెలియగానే తమిళ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

అమెరికాలో మైక్ టైసన్‌తో కలిసి రచ్చ చేస్తున్న ‘లైగర్’ టీం

కోలీవుడ్‌లో మనోహర్‌కు దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మనోహర్‌ కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత రచయిత, నటుడు, దర్శకుడిగా మారారు. రచయితగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ‘కొలంగళ్‌’, ‘తెన్నవన్‌’, ‘పున్నాగై పూవే’ లాంటి చిత్రాలకు మాటలు రాశారు. ‘మాసిలమని’ సినిమాతో దర్శకుడిగా మారారు మనోహర్. 2011 లో చివరిసారిగా ‘వెల్లూర్ మావట్టం’ అనే సినిమాని డైరెక్ట్ చేసారు. ఆ తర్వాత దర్శకత్వం వదిలేసి పూర్తి స్థాయి నటుడిగా మారారు. ‘కొలంగళ్‌’, ‘తెన్నవన్‌’, ‘వీరం’, ‘వేదాలం’, ‘మిరుథన్‌’, ‘ఖైదీ’, ‘విశ్వాసం’, ‘టెడ్డీ’… లాంటి ఎన్నో తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కూడా ఈయన కనిపించారు.

Chiranjeevi : ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి : చిరంజీవి

ఈయన మృతి ప‌ట్ల‌ పలువురు సినీ ప్రముఖులు, తమిళ సినీ పరిశ్రమ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.